పుట:2015.396258.Vyasavali.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

-42 . వ్యాసావళి ములు చూపించి, “ ఛందోయతిప్రాస శ్లేషయము కాదులచే నిబద్దములయి సామాన్యముగా మార్పరాని స్థలములే సందిగ్గ విషయ నిర్ణాయక ములగునని” లాక్షణికులం సిద్ధాంతము చేసినట్లు తెలియజేసినారు. కొందరు మహాను భావులం ఇట్టి స్థలమందున్న శబ్దములుకూడా తమకు అనిష్టమైతే దిద్ది గ్రంథ ములు పరిష్కరించినారు. సన్న యభారతములోని తెనుగు కొంత నేటివ్యవహారములో నిల్చి ఉన్నా చాలా భాగము మారినందున, పండితులని పేరుగలవారు, ప్రబంథ ములు నోచించిన కవులు, లాక్షణికులు, ప్రాచీనభాషాశబ్దములను గురించి తబ్బిబ్బులు పడుతు న్నారు. రెండుమూడు విషయములు ఉదాహరిస్తాను. (1) " నమ్మ నేర నయ్యెదను » మొదలయిన క్రియలు నన్న యభ కాదు; తర్వాతికవులు తిక్కన, ఎఱ్ఱన, శ్రీనాధుడు వాడిఉ న్నారు. ఆంధ్రశబ్ద చింతామణిలోని బాలవ్యాకరణములోగాని ఇట్టి శబ్దములకు అనుశాస నము ఏర్పడలేదు. కీర్తి శేషులయిన కొక్కొండ వేంకటరత్నము పంతులవారు ఇట్టి శబ్దము ప్రయోగిస్తే బ. శ్రీ. వేదం వేంకటరాయశాసలవారు వారిని పడతిట్టినారు. శ్రీనాధుని నైషధము ఈ శాస్త్రాలవారు పరిష్క రించి అచ్చు వేయించినపుడు ఆప్రబంధములో ఇట్టి ప్రయోగములు రెండు కన బడితే తప్పులని దిద్దుటకుకూడా సాహసించినారు. ఇట్లే నన్న యాది ప్రాచీనకవులు పొడినవి, ఇచ్చి పుచ్చు మొదలయినవి, ఈశాన్డూలవారే తప్పులనుకొన్నారు. (2) తెంచు అమబంధముగా 66 ఏఁగ దెంచు, చనుదెంచు, తాఁకుదెంచు, అగుదెంచు మొదలయినక్రియ ఆ మేక ముగా నన్నయ భారతములో నున్నవి. శబ్దరత్నాకరమందు ఈ తెంచు” స్వార్ధమందు వస్తుందని చెప్పిఉన్నది గాని తప్పు. “ఏగెను” అంటే “పోయెను” ఏగుదెంచెను” అంటే “వచ్చెను”. ఇట్టి శబ్దములు సుపరిచితమయినవి కాకపోవుటచేత వ్యతిరేకార్థమందు పాఠశార్దమందు తుమర్ధమందు వీటికి