పుట:2015.396258.Vyasavali.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

వ్యావహారిక భాషా బహిష్కార నిరసనను 11 వ్యావహారిక భాష నిప్రయోజనమని మన పూర్వులు ఎన్నడూ తలంచ లేదు; అది అపరిమిత ప్రయోజన మైనదని పూర్వపండితులు అంగీకరించినట్టు పోరి గ్రంథము లే ప్రమాణము. చూడండి: మన పూర్వలు దునవ లెనే ఉత్తరప్రత్యుత్తరములు, క్రయపత్రములు, దానపత్రములు, ఒడంబడికలు పెందలయినవి వ్యావహారిక భాషలో వ్రాసే వాగన్నందుకు ప్రాచీనులు తాటాకులమీద వ్రాసిన వ్రాతణ కనబడలేదు? గాని మన తాతల నాడు, ముత్తాతల నాడు, అంతకు రెండు మూడు తరములకు పూర్వమందును వ్రాసిన తాటాకులున్నవి. (చూ. సాహిత్య పరిషత్పత్రిక 11 పుట 219, మధు సోయకుల దానపత్రము 2). ప్రాచీన కాలమందు కూడా అట్టి ఆచాగ ముండేదని చెప్పుటకు తగిన ప్రమాణము శిలాశాసనము లందున్ను తామ్రశాసనములందున్ను కలదు. మహారాజాధిరాజులు తమ గున్ను తమ తల్లిదండ్రులకున్ను పుణ్యమూ కీర్తీ వృద్ధియగుటకై దేవాలయ ములు, ప్రాకారములు, మండపములు, చెరువులు కట్టించి, ఈశ్వరారాగ సా బ్రాహ్మణుల కర్మలూ నిరంతరాయముగా జరుగుటకొరకు అగ్రహారములు దానము చేసి తమ ధర్మములు ఆచంద్రార్కము చెల్లవలెనని శాసనములు చెక్కించి ప్రకటించినారు. కొందరు మహారాజు వాణిజ్య వ్యాపార ములు అభివృద్ధిపొందుటకై స్వల్పసుంకములు నియించి ఈ ఆభయశాసన ములు” శిలా స్తంభ ములమీద చెక్కించినారు. రాజులవలె నే ప్రజలలో ధనవంతులు కొందరు కూడా చేసేవారు. ఈ శాసనముల రచన సనాతన సంప్రదాయసిద్దమైనది. దాతల ప్రశ స్త్రీ వంశవన తరుచుగా సంస్కృత మున, క్వాచితముగా గేనుగున, చంపూ కావ్యములో ఉన్నట్టు, గద్య 'పద్యాత్మకము గా ఉంటుంది. శాసనములోని ముఖ్యవిషయము వ్యావ హారిక భాషలో అందరికీ సుబోధముగా ఉండేటందుకు ప్రక టీంచుట మామూలు. దానము చేసిన గ్రామముల సరిహద్దులు నిరూపించినప్పుడు