పుట:2015.396258.Vyasavali.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

వ్యావహారిక భాషా బహిష్కార నిరసనము 7 నిత్యమున్ను జనులందరూ వాడుతూఉన్న భాష రద్దుజేసి, గ్రాంథిక భాష దానికి మారుగా వాడవలసినదని శాసించేవారు. వి వేకులయి తే, గాంథిక మేదో స్పష్టముగా నిరూపించి, దానిని సులభముగా అందరూ నేర్చుకొనుటకు అనుకూలమయిన సాధనములు ముందుగా ఏర్పర్చి ఉందురు. గాంథిక భాషాలకుణము ఇంకో గాంథిక భాషాకావ్య పరులందే నిగూఢ ము-గా ఉన్నది. ఇప్పుడున్న వ్యాకరణములవల్ల ఆ లక్షణము స్పష్టముగా తెలియదనీ, ఇప్పుడున్న నిఘంటువులవల్ల శబ్దరూపములు శబ్దార్థములు శబ్ద ప్రయోగములు నిస్సంశయము"గా తెలుసుకొనుటకు సాధ్యము కాదనీ, భార తాది ప్రబంధముల పాఠములు ఇప్పటి అచ్చు పుస్తకములలో శుద్దమయిన వని విశ్వసింప లేమనీ, ప్రాచీన గ్రంథములు అచ్చు పడకుండా ఇంకా అనేక మున్న వనీ, అవికూడా శోధించి చూస్తే నే కొని ఆ భావాలక్షణము సంపూర్ణ ము"గా ఏర్పడదనీ_మ. జయంతి రామయ్య పంతులు గారే విరోధికృన్నామ సంవత్సరాది సంచిక లో “ఆంధ్రభాషాసంఘము” అనే వ్యాసమందు వ్రాసి ప్రకటించినారు. ఇట్లే శ్రీ వేదము వేంకటరాయశాస్త్రిగారు నెల్లూరిలో జరిగిన పరిషత్సభలో అధ్యక్షోపన్యాసమందున్ను శ్రీవరుల చిన సీతారామస్వామిశాస్త్రిగారు ఆ సభలో నే అంధవ్యాకరణములనుగూర్చి చేసిన ఉపన్యాసమందున్ను విశదపర్చి సారు. ఈ భాష కేవల గ్రంథస్థమయి, ప్రయోగళరణముగా నే ఉన్నది. ఒక వ్యాకరణమునుబట్టి సాధువనవలసిన శబ్దము మరి ఒక వ్యాకరణమునుబట్టి అసాధువనవలసి ఉన్నది. ఒక కోశ మునుబట్టి సాధువుగా కనబడే శబ్దరూపము మరి ఒక కోశమునుబట్టి ఆసాధు వుగా కనబడుతుంది. ఈ భాషలోని శబ్దములరూపము సందిగ్ధము. శబ్ద ములలో ఔపవిభక్తికము లేవో, అనౌపవిభక్తిక ము లేవో ఏర్పడలేదు. "కావలసిన విభక్తిలోగాని, వచనములో గాని ఏ శబ్దము పడితే ఆ శబ్దము ప్రయోగించుటకు సిద్దరూపములు తెలిస్తే నే కాని వల్లపడదు. ఏవి నిత్యైక