పుట:2015.396258.Vyasavali.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

వ్యాసావళి మోటిమాటలతో నే ఉపన్యాసములు చేసినారు. వారి శిష్యులలో వాత నేర్చినవారు ఆ మాటలు వ్రాసి పెట్టుకొని తాను చదువుకొంటూ ఇతరులకు చదివి వినిపించేవారు. ఇదే లోకమందు సంప్రదాయము. (గాఁథికాంధ్రమునందు మనవారికీ గల గౌరవము భారతాది ప్రాచీన గ్రంథములయందున్న గౌరవమునుబట్టి కలిగిన దే; కాని దాని ప్రాచీనత చేతనూ దానిని అభ్యసించుటకు పడవలసిన కష్టను చేతనూ కలిగినది కాదు. ప్రాచీనభాషలన్నీ ప్రాచీన కాలమందు వాడుక లో సర్వజనసామాన్య మైన నే విషయమందు స్వతః లేని గౌరవము ప్రాచీన భాషలో చెప్పి తే మాత్రము వస్తుందా? విషయమందు వా స్తవము గా ఉన్న గౌరవము సర్వసామాన్య మైన భాషలో చెప్పి తే పోతుందా? లేక తగ్గుతుందా? భాష పరమార్ధము కాదు. అర్థ సిద్ధికి సాధనము; ఉపకరణమువంటిది. చిన్న స్పటినుండి అందరికీ సామాన్యముగా అలవడ్డ భాషకన్న ప్రయత్న పూర్వకముగా నేర్చుకొంటే నే కాని రాని భాష భావబోధకు అధి కానుకూల మైన సాధనమవుతుందా? లౌకిక భాష త్యజించే వారికి లోకయాత్ర జరగదు. అవసగోచితముగా వాడుక చొప్పున ఎవరిదర్జా వారు మాట్లాడవచ్చును. వచ్చీ రాని ‘గాంథికాంధ్రము” తో మాత్రము తమ భాషాపొండిత్యము లోక వ్యవ హాగమందు ప్రకటింపజేయడము హాస్యాస్పదముగా ఉంటుంది. ఇంటర్ పెటర్లు, ట్రాన్సలేటర్లు వారి అభిప్రాయములు వాడుక మాటలతో తెలియ జేస్తే నే కాని వ్యవహారహాని కలుగుతుంది. మన దేశభాష రానివారు మన దేశము వచ్చి హిందీలోనో ఇంగ్లీషులోనో ఉపన్యాసములు చేస్తే వాటి అర్థము ఆ భాషలు నేర్చిన తెలుగువారు మనకు తెలిసిన తెలుగున "చెప్పక గాంథికాంధ్రములో చెప్పడము వ్యర్థ ప్రయాసము కాదా? ఒక తెలుగు వాడు ప్రాచీనాంధ్రభాషా పండితుడైనా, తెలుగు ప్రజలతో మాట్లాడే టప్పుడు, అందరికీ సుబోధముగా తన వాడుక మాటలే పొడవ లేనుగదా,