పుట:2015.392383.Kavi-Kokila.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

62 కవికోకిల గ్రంథావళి [పంచమాంకము

రాము : తాపసోత్తమా, దు:ఖ మెంత యడఁచికొన్నను నీటిబుగ్గవలె నిరంతరముగఁ బెల్లుబుకుచున్నది.

                     విరహ సంతాపమెట్టిదో నిరయగహ్వ
                     రంబువెడలెడి ధూమపరంపర లటు
                     లేచి హృదయాంతారాళ మలీమసముగఁ
                     గడలుకొను బుద్ధిసూర్యుండు కప్పువడఁగ.

[భరతుఁడు లక్ష్మణుఁడు ప్రవేశింతురు.]

రాము : [ఆతురతతో] అన్నా లక్ష్మణా, నాజానకి నేమిచేసితివి? [కౌఁగిలించుకొనును]

లక్ష్మ : కఠినాత్ముఁడను, మీయాజ్ఞ నిర్వర్తించి వచ్చితిని.

రాము : హా! మదెక జీవితా, సీతా. [క్రుంగిపోవును]

[యవనిక జాఱును]