పుట:2015.392383.Kavi-Kokila.pdf/333

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సుబ్బరామిరెడ్డిగారి కవితా ప్రియత్వము, ఔదార్యము నన్ను ముగ్ధుని గావించినవి. అర్థింపఁబడియు కవులకు సహాయము చేయు కవితాపోషకులు అరుదైన ఈకాలమున సుబ్బరామిరెడ్డిగారి ఈయయాచిత సాహాయ్యము ప్రశంసా పాత్రమని వేఱుగ చెప్పనక్కఱలేదు. నేను వారికెంతయు కృతజ్ఞుఁడను.


సుబ్బరామిరెడ్డిగారి జనకులు

కీ. శే. రేబాల సుబ్బారెడ్డిగారిస్మృత్యర్థము

ఈ కవికోకిల గ్రంథావళి యచ్చొత్తింపఁబడినది.

నేను నెల్లూరిలోనుండి అచ్చుప్రూపులు స్వయముగ దిద్దికొన వీలులేకయున్నందున నామిత్రులును, మృదుమధుర కవితారచయితలునగు గోనుగుంట పున్నయ్యగారును, చిరకాలమిత్రులును "హాలిక" లాంఛన విశ్రుతులును ప్రభాత ముద్రణాలయాధికారులును అగు మరుపూరు కోదండరామరెడ్డిగారును ప్రూపులుదిద్ది శ్రద్ధతో మిత్రకార్యము నెరవేర్చిరి. వారిసాహాయ్యమునకు నేనెంతయు కృతజ్ఞుడను.

నెల్లూరు,
30-5-1936

దువ్వూరి రామిరెడ్డి.

____