పుట:2015.392383.Kavi-Kokila.pdf/320

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కవికోకిల గ్రంథావళి

the olymphic running race. [సిగరెట్టు కేసు తెరచి సిగరెట్లు లేకయుండుటను చూచి] సిగరెట్ ప్యాకెట్టు పట్టుకొస్తాను.

కళ్యాణ : నాకుకూడా వొక కిళ్లీ పట్టుకరండి.

రంగా : మీరింకా సెల్ఫ్ హెల్ప్, డిగ్‌నిటీ ఆఫ్ లేబర్ (self help-dignity of labour) నేర్చుకోవాల. ఫోర్డు వంటి కోటీశ్వరుడు తన బ్యాగ్ తానే తీసుకొని వెళ్ళతాడు. కిల్లీ కొనుక్కోడానికి ఒక మీడియేటర్ (mediator) ఎందుకు? [అని కళ్యాణిరెడ్డి చేయిపట్టుకొని లాగుకొనిపోవును.]

[మోటారు హారన్ వినబడును; ఒక ప్లీడరు ఆయన భార్య ఆ దారిని వత్తురు. ఆయన ఖద్దరు పంట్లాము కోటు వేసుకొని యుండును. ఆమె సిల్కుచీర కట్టుకొనియుండును.]

భార్య : టై మైందండి. ఇంకకొంచెం ముందుగా కోర్టునుంచి రమ్మంటే వచ్చారుగారు. నేనిప్పు డొక మీటింగులో ప్రెసిడెంటుగా వొప్పుకొన్నాను.

ప్లీడ : ఏమ్మీటిం గేంటి?

భార్య : స్త్రీజనోద్ధరణం మీటింగండి. నేనొక వుపన్యాసం వ్రాసుకొచ్చాను.

ప్లీడ : ఏం వ్రాశావు?

భార్య : ఆంధ్రపత్రికలో వస్తే చూస్తురుగాని లెండి. ఇప్పుడు చెబితే స్వారస్యం పోతుంది.

[బిడ్డ యేడ్చును. వెంకటరెడ్డి లాలించును.]

ప్లీడ : ఎవ్వరది? [తిరిగిచూచి] Hallo ǃ good-evening Mr. Reddy.