పుట:2015.386124.adhiqs-eipa-shatakamulu.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.

బలదేవుందతి నీచవృత్తిని సురాపానంబు గావింపఁగా
జలజాతాస్త్రుఁడు మానినీ పురుషలజ్జాత్యాగముల్ సేయఁగా
చలమారంగనలక్ష్మి సజ్జనుల నిచ్చల్ పట్టి బాధింపఁగా
మలపం జాల విదే వివేక మిల? రామా! భక్తమందారమా!

90


మ.

అదిరా! పిల్చినఁ బల్కవేటికి? బరాకా చాలు నిం కేలఁగాఁ
గదరా! మిక్కిలివేఁడి వేసరిలు బాగా? నీకు శ్రీజానకీ
మదిరాక్షీ శరణంబులాన! నను బ్రేమన్ బ్రోవరా వేడ్క శ్రీ
మదుదుంచత్ప్రభుతాగుణప్రథిత! రామా! భక్తమందారమా!

91


శా.

వందిం బోలి భవత్కథావళులనే వర్ణింతు నత్యంత మీ
చందం బొందఁగఁగొందలం బుడిపి నిచ్చల్లచ్చి హెచ్చంగ నీ
వందందుం దిరుగంగబోక దయ నాయం దుండు మెల్లప్పుడున్
మందప్రక్రియమాని పూనికను రామా! భక్తమందారమా!

92


మ.

అకటా! తావకకావ్య భవ్య రచనావ్యాపార లీలావిలో
లకసత్స్వాంతుఁదనైన నా పయిని నీలక్ష్మీకటాక్షామృతం
బొకవేళం జనుదేరదేమి? దయలేదో యోగి హృత్పద్మస
నృకరందాసవ పానకృద్భ్రమర రామా! భక్తమందారమా!

93


మ.

నతమర్త్య వ్రజ వాంచితార్థ ఫలదాస శ్రీవిరాజన్మహో
న్నత మందారమ వంచు ధీరజను లానందంబునం దెల్ప నే
వ్రతచర్య న్నినువేఁడి వేసరితి ప్రోవన్ రావిదే నీకుస
మ్మతమా! తెల్పుము తేటతెల్లముగ రామా! భక్తమందారమా!

94


మ.

పదపద్యంబు లొనర్చి నీకొసగనో ప్రాజ్ఞుల్ నుతింపగ మీ
పదపద్మంబులు భక్తితోడ మదిలో భావింపనో! యేమిటం
గొదవే దేఁటికి జాగుచేసెదవు? కోర్కులు దీర్పువేవేగ! శా
మదరాతిక్షణ దాచరప్రమద! రామా! భక్తమందారమా!

95