పుట:2015.386124.adhiqs-eipa-shatakamulu.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.

క్రతువుల్ సేసెదనంటినా, బహుపదార్థంబిల్లె! సంధ్యాజప
వ్రతముల్ సేసెదనంటినా దొరలఁ గొల్వంగావలెం గూటికె
ధృతి నిన్వేడెదనంటినా నిలువ దొక్కింతైనగానీ దయా
మతి నన్నేగతిఁబ్రోచెదో యెఁఱుగరామా! భక్తమందారమా!

96


మ.

తగునా పావన తావకీన పదధ్యాననిష్ఠాగరి
ష్ఠ గతిన్ వర్తిలుమాకు నిప్పు డతికష్ట ప్రాప్తిఁగావించి బల్
పగవానిన్ బలెఁజూడఁగాఁ హటకటా! పాపంపు గాదోటు! జి
హ్మగ సమ్రాట్కరకంకణప్రణుత! రామా! భక్తమందారమా!

97


మ.

నిను నా దైవముగా భజించుటాకు నేనిత్యంబుఁ గావించు స
జ్జనతాకర్ణ రసాయన ప్రకటభాస్వత్ సోము లేసాక్షి నీ
వనుకంప న్నినుఁబ్రోచుచుండుటాకు నీయైశ్వర్యమె సాక్షి నీ
మనసు న్నా మనసు న్నె~ౠఁగు నిది రామా! భక్తమందారమా!

98


మ.

జయ మొప్పార నిను న్మదీయ హృదయాబ్జాతంబునం గొల్తు నే
రములెల్లన్ క్షమచేసి ప్రోతు వనుచున్ రాఁగంజనన్ నీదుచు
త్తము నాభాగ్య మదెట్టిదో యెఱుగ తధ్యం బిద్దసంగ్రామ ధా
మమహాకాయవిరామశతశర! రామా! భక్తమందారమా!

99


మ.

జయనారాయణ! భక్తవత్సల! హరే! శౌరే! జగన్నాయకా
జయ! సీతాహృదయేశ! శేషశయనా! శశ్వద్దయాసాగరా!
జయ పీతాంబర! రామచంద్ర! జలదశ్యామాంగ! విష్ణో! నిరా
మయ! లీలామనుజావతారధర! రామా! భక్తమందారమా!

100


మ.

సరసప్రస్తుత కూచిమంచి కులభాస్వద్వార్ధి రాకాసుధా
కరుఁడన్ గంగన మంత్రినందనుఁడ! రంగల్తిమ్మభూమండలే
శ్వరపర్యార్పిత "బేబదల్" బిరుదవిస్ఫాయజ్జగన్నాథనా
మ రసజ్ఞుండను బ్రోవు మెప్డు నను రామా! భక్తమందారమా!

101