పుట:2015.386124.adhiqs-eipa-shatakamulu.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శా.

శ్రీలక్ష్మీ మదయుక్తుఁడై నృపుఁడువాసింబేర్చు భూదేవునిం
గేలింబెట్టి తదీయకోమ మహిమన్ గీడొందు నెట్లన్న ది
క్ఖేలత్కీర్తి త్రిశంకుం డల్క నలశక్తింబల్కి తద్వాగ్గతిన్
మాలండై చెడిబోవడోట మును రామా! భక్తమందారమా!

78


మ.

లస దుద్యజ్జ్వల భవ్యదివ్య కవితాలంకార విద్యావిశే
షసమాటోప విజృంభమాణ కవిరాత్సంక్రందనుం ద్రిప్పి త్రి
ప్పి సమీచానతఁబ్రోవకుండు నృపతుల్ పెంపేది నిర్భాగ్యులై
మసియై పోవరె తత్క్రుధాగ్ని నిల రామా! భక్తమందారమా!

79


మ.

రసికత్వంబును దాన ధర్మగుణముం బ్రత్యర్థిశిక్షాకళా
భ్యసనప్రౌఢిమ నాధుబంధుజనతా త్యం తావనోపాయ లా
లసచిత్తంబును దృప్తియుం గొఁఱత వాలాయంబు దానెంచఁదా
మసమే మిక్కిలి దుర్నరేంద్రులకు రామా! భక్తమందారమా!

80


మ.

ఖలభూనాథఁడు నిచ్చనిచ్చ జనులన్ గారించి విత్తంబు మి
క్కిలిగా గూరిచి పుట్టలో నిఱికి వేఁగింపంగ నుద్దండతం
బలవన్మేచ్ఛులు పొంది లావనుచు లే బాధింతురౌపెట్టి జెఱ్ఱిఁజీ
మలు చీకాకుగఁ జేయుచంగముగ రామా! భక్తమందారమా!

81


మ.

అతికష్టం బొనరించి భూమిజనుఁ డత్యాసక్తి విత్తంబు వి
స్తృతభంగిం గడియింపఁగా నెఱిఁగి ధాత్రీకాంతు లుద్దండ ప
ద్ధతి వానిం గొనిపోయి కొట్టి మిగులం దండించి యా సొమ్ము స
మ్మతిఁగైకొండ్రు మఱెంత నిర్దయులొ రామా! భక్తమందారమా!

82


శా.

దానంబిల్లె, దయారసంబు నహి, సద్దర్మంబుతీర్, మీపద
ధ్యానంబున్ గడులొచ్చు సత్యవచన వ్యాపారముల్ సున్న సు
జ్ఞానం బెంతయు నాస్తి సాధుజన సన్మానేచ్ఛ లే దెన్న నీ
క్ష్మానాధాధమకోటి కేది గతి రామా! భక్తమందారమా!

83