పుట:2015.386124.adhiqs-eipa-shatakamulu.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

170 అధి క్షేప శతకములు

వెలకాంత లేందరైనను -క లిమిగల లోభికన్నను-మున్నగు పద్యము లీ శక్తిని చాటుచున్నవి. సుపరిచితములైన నూత్నోపమానములు, నిశిత పరిశీలనాత్మక దృష్టితో కూడిన లోకజ్ఞత, మానవ మనస్తత్వ పరిశీలనాత్మక రీతులు భావ వ్యక్తీకరణకు భిగిని చేకూర్చినవి. సామాన్యమైన అంశములను సరసమైన ఉప మానములచే వ్యక్తీకరించుట యందు, గంభీరోదాత్త విశేషముల సలవోకగా సామాన్యరీతిలో వివరించుటయండు కవికి గల నేర్పు ప్రశంసార్హము.

గువ్వలచెన్నని లోకజ్ఞత బహుముఖముగ నున్నది, నీతిశాస్త్ర శ్లోక భావములను నిశితలోక పరిశీలనాత్మక దృష్టిలో రంగరించి వ్యక్తీకరించిన పద్యము లీ శతకమున ఎన్నియో కలవు. మిత్రుని విపత్తునందు- నీచున కధి కారంబును—అను పద్యము లిట్టివి.

నీతి అధిక్షేప శతకములలో సాధారణముగ కలియుగధర్మముల ప్రసక్తి వచ్చును, పాశ్చాత్య నాగరికత ముద్రపడిన అనంతరము సాంఘిక వ్యవస్థలో కలిగిన మార్పులను గమనించి గువ్వలచెన్న శతకకర్త పాస్తవిక దృక్పథము వహించెను. పర్ణభేదములు లేక కాలక్రమమున అందరును ఆచారాదులందు ఒకే విధానము సనుసరింతురని పచించిన సందర్భమిట్టిచి,