పుట:2015.372978.Andhra-Kavithva.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

74

ఆంధ్ర కవిత్వచరిత్రము

ప్రథమ


నుపాసింపంబడుటయే సంభవించి పాశ్చాత్యలోకమునఁ గొన్ని యెడల నాస్తిక మతమునకును, సర్వత్ర యనాధ్యాత్మిక జీవిత మునకును గౌరణభూతము లయినవి. భారత దేశమునందలి మహర్షులును, దృష్టలును బై వానిని సాధనమాత్రములుగనే పరిగణించి యాధ్యాతక జీవితోపలబ్దికిని ధర్మానుష్ఠానమునకును సాధనములుగ నుపయోగించిరి. 'శరీర మాద్యం ఖలు ధర్మసాధ నమ్' అనువచనమే యిందులకుఁ దార్కాణము. ఆధ్యాత్మిక దృష్టిగలవారు జీవితమునందలి సర్వోపొంగములను నాత్మోప లబ్ది కై వినియోగించెదరుగాని వానినే సాధ్యములుగ నుపా సింపరు. వారు బాహ్యసృష్టియందును, సాధారణ మానవజీవి తమునందును మానవ సంస్థలయందును గలయాధ్యాత్మికశక్తిని, దేజమును వ్యక్తముఁగావింపఁ జూచెదరు.

ఆధ్యాత్మిక కావ్యరచనాసూత్రము. "కావ్య మాధ్యాత్మికశక్తికి సంజ్ఞా రూపకము.”

కావ్యమున బాహ్య సృష్టియు మానవజీవితమును సాధ్య దేవతలవలెంగాక సాధనమాత్రములుగను, బరతత్త్వమున కును, నాధ్యాత్మిక ప్రపంచకమునకును సంజ్ఞారూపకములుగ వర్ణింపఁబడినచో నయ్యదియే యాథ్యాత్మికకావ్యసృష్టియగును. అయ్యది 'వేదాంతమువలె సిద్దాంతరూపమున నుండక సృష్టి రూపముననే యుండి యాధ్యాత్మిక ప్రపంచమును సంజ్ఞా రూప మున గోచరింప జేయును. కావునఁ గాప్యరసమునకును, నాధ్యా త్మీకదృష్టికిని, విరోధభావము ' లేదనియు నొండొంటికి సహకారభావ మేవర్తిల్లుననియు, నట్టిసహకారభాపము పూర్తిగఁ గుదిరిన కావ్యము లే యుత్తమకావ్యము లగుననియు, నట్టి కావ్య