పుట:2015.372978.Andhra-Kavithva.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము,

రసాత్మకం వాక్యం 'కావ్యమ్.

75


రచనకే 'ప్రజ్ఞా పురాణీ' సంతతి వారగు భారతీయులు చిరానుగతమగు స్వీయ కార్యధర్మమును వీడక కడంగి యాథ్యాత్మిక జ్యోతి చే నుద్దీప్మములుగాని దేశములకుఁ బ్రకాశము గూర్పఁ దగుననియు నరవిందుఁడు భారతసాహితీ కుమారుల నుద్బో ధించుచున్నాడు. - రవీంద్రుని మతమును, వైష్ణవ సుఫీ కవులమతమును. ఈయుద్బోధ ననుసరించి వ్రాసెనని రవీంద్రునిగూర్చి పలుకుట ప్రమాదము. ఏలనన నరవిందుఁడు కావ్యతత్త్వమును నిరూపింపక మున్న యెన్నో యేండ్లుగ రవీంద్రుఁ డాథ్యాత్మిక శక్తి యుక్తమగు కవిత్వమును జెప్పుచుండి నాఁడు. కాని ప్రధాన విషయముల రవీంద్రుని పద్దతి యరవిందుని కావ్య లక్షణమునకు లక్ష్యమగుచున్నది. చండీదాసు మొదలగు వైష్ణవకవుల కవిత్వ మును, సుఫీకవుల కవిత్వమును నరవిందుని కొవ్యలక్షుణమువకు సరివచ్చుచున్నవి. ఇందుఁ బరమాత్మతత్త్వము బాహ్యవస్తువర్ణ నమువల్లను, మానవ జీవితపర్ల నముపల్లను,సూచింపఁబడుచున్నది. ప్రకృతికిని, మానవునకును, బరమాత్మకునుగల యవినాభావ సంబంధ మనిర్వాచ్యైక్యము నీ కావ్యపద్దతి పరిస్ఫుటీకరించు చున్నది, ఈమహదాశయము సంపూర్ణముగ నేప్పట్ల నెవ్వరి యందునను నెఱవేఱినదని చెప్ప వీలు చాలకున్నది. కానీ కాల, ప్రభావము వలన పురోగమనముమాత్రము జరుగుచునే యున్నది. ఈపురోగమన ఫలితముగ గతానుగతీకముగ మనలను. వేధించుచుఁ దలయెత్తకుండ సడఁగద్రొక్కిన భావదాస్యమును,, లక్షణదాస్యమును, బ్రయోగమొలభ్యముని పీడ వియ్యో అయత్తమకవిత్వమును జనించి ప్రపంచమునకు భారతీయ కవితాశ క్తిని,