పుట:2015.372978.Andhra-Kavithva.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము. రసాత్మకం వాక్యం కావ్యమ్,

69


కావ్యశక్తియే వాగ్గేవి యనఁదగును.

కావ్య మొకశక్తిగ భావించి మన వేదయుగమునాఁటి ఋషులును, దత్త్వవేత్తలును గొవ్యశక్తికి వాగ్గేవీనామమిడిరి. తాంత్రికులును వాక్శకి మనలను న నేకవిధముల సంచలింపఁ జేయునదిగ నిరూపించిరి. కవి యాథ్యాత్మికదృష్టి బలమున నాధ్యాత్మికశక్తిని, నాథ్యాత్మిక భావములను, నాధ్యాత్మిక ప్రపంచమును సాక్షాత్తుగఁగన్నులఁ దిలకించిన వానిరీతిని వర్ణించి ప్రదర్శించును. "కావ్యశక్తి బుద్ధిబలమున కతీతమగును. ప్రపం చమునను, బ్రకృతియందునను, మానవ జీవితమునను నంతర్గర్బి తమై నిబిడ మై యున్నయా ధ్యాత్మికశక్తిని రసవంతమును బరీ స్ఫుటమును సనీరుద్ధ్యమును నగువాక్కున కవి వర్ణించి ప్రద ర్శింపఁజూచును.

'తాంత్రికుల'మతము, 1 'పశ్యంతీ' శబ్దప్ర యోగము దాని భావము.

ఈవాక్కును దాంతికులు 'పశ్వంతి' యనుపదమున సూచించి కావ్యశక్తి యొక్క పరిమితిని సూచించియున్నారు. ఈ భావముఁ గొంచెము విప్పి చెప్పిన నిట్లుండును. కవికి విషయ సాత్కారముతోబాటు వాగ్గేవీసాలు త్కారము ననఁగాఁ బదసాక్షత్కారమును గలుగని, యుత్తమకవిత జనింప "నేరదు. దీనిభావము కవి పదసాక్షాత్కారలబ్దములగుమాటలం ధక్క. సన్యమార్గలబ్దములగుననఁగా నిఘంట్వాదిమార్గము లచే లబ్దములగు పదములఁ గవిత చెప్పఁదగదనియు, నట్లు చెప్పినకవిత యుత్తమకవిత గాదనియు విదితమగు చున్నది, కావ్యమువ సాక్షాత్కృతవిషయమునకును, భాషకును వికల్ప