పుట:2015.372978.Andhra-Kavithva.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము.

రసాత్మకం పోక్యం కావ్యమ్.

55


పోయేను. మతాచార్యులందఱును దొంగలుగను నిరంకుశాధి కారవర్గమిత్రులుగను భావింపఁబడుటచే వారి చేఁగావింపఁబడిన నైతిరధారిక నియమములన్నీ యుఁ దిరస్కార పొత్రములుగ గణింపఁబడినవి. నీతి నియమముల నేర్పఱచుటకు మతాధికారు లకుఁగల ప్రభుత్వమును దిరస్కరించి పరాసులు మానవుని జన్మ గౌరవమును జన్మస్వత్వములును, బవిత్రములుగ భావించి తదనుగుణమగు స్వాతంత్ర్య ప్రవృత్తియే యుత్తమనీతిపథమని నిర్ణయించి కావ్యమున నట్టిస్వాతంత్ర్య ప్రవృత్తికే తావొసంగిరి. శానినీతికి గౌరపపద మీయ రైరి. వర్డ్ స్వర్, కోలరీడ్స్, షెల్లీ, కీట్స్, బైరన్ , మొదలగుకవులు నీతికిఁ గావ్యములు బ్రాధాన్య మొసఁగక రసప్రవృత్తినే మిక్కిలి పోషించిరి. బైరస్ ఇంచుమించు నతని దిరస్కరించెననియే చెప్పవచ్చును. మొత్తముమీఁద బరాసు విప్ల వముమూలమున నతివాదము నకుఁ బెద్ద దెబ్బ తగిలినదని యాంగ్లేయసాహిత్యపరిచితులకు విశదమగును. కాని స్వాతంత్ర్యరక్తి యతిశయించినకొలఁది నీతియందలి రక్తియు సన్న గిల్లుచుండెను. కోలరిడ్జ్, డిక్విడ్ సి, బైరస్, షెల్లీ, కీట్స్, మొదలగు కవుల జీవితచరితమే యిందులకుఁ దార్కాణము. ప్రతిభాశాలు లెల్లరును నీతివిదూరులై యకాలమరణమువాఁతఁ బడుట సంభవించుచుండెను.

5. మాత్యూ ఆర్నాల్డునిమతము. 'కావ్యము జీవిత విమర్శనమే యగును.”

. .. ఇట్టిసమయముల “మాత్యూఆ ర్నాల్డు' అనుకవి యుద్బ విల్లి యాంగ్లేయసారస్వతమును నీతిపథమునఁ ద్రిప్పజూచేను. అతఁడు కావ్యము జీవిత విమర్శవ మనియుఁ, గావ్య పరమావధి