పుట:2015.372978.Andhra-Kavithva.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్రకవిత్వచరిత్రము

ప్రథమ

52


ఆంగ్లేయ విమర్శకులలో నెల్లఁ బ్రథముఁ డనఁదగు 1. సిడ్నీ

యనునతఁడు కావ్యము ప్రత్యక్షముగ నీతిబోధకముగాదనియుఁ బచ్చన్నముగ నీతిని బోధించియే తీరవలయుననియు శాసించి తనమతమును నీ క్రింది విధమునఁ దెలిపెను. వైద్యుఁడు చేదు మాత్ర నిచ్చినయెడల రోగి మింగ లేఁడని తలంచి యామాత్రకుఁ గొంచెము తీయని పదార్ధము ననఁగాఁ జుక్కెర, తేనే మొదలగు. వానీని బైపూఁతఁ బూసి యిచ్చి యెటులు రోగము మాన్పఁ జూచునో యట్లే కవియు నీతినిఁ బ్రత్యక్షముగ బోధించినచో జనులకు రుచింపనేరదని యెంచి రసమును నొక పై పూతఁగఁ గావించి కథావర్ణన మొదలగు నలంకారములచే నీతిని జనులకు హృదయంగమమగురీతిని బ్రదర్శించనని సిడ్నీ తెల్పెను. ఈయుదాహరణమునఁ గవికి నీతిబోధన ప్రధానకర్తవ్య మనియు, రసము, సాధనమాత్రమే యనియు ద్రుపపడు చున్నది. కాని సిడ్నీ తరువాతః గవులు నప్పటి దేశ కాలపొత్రముల సరణి ననుసరించి సిడ్నీ మతము నంగీకరింపక యింగ్లండు పరదేశముల నిర్జించి జయోద్దతి చేఁ బ్రకాశించుకతమున నింగ్లండు దేశము యొక్క యాన్న త్యమును నందలి, ప్రజల యొక్క జీవితములును వర్ణించిరే కాని నీతిని బ్రత్యక్షముగ బోధింపఁ బ్రయత్నింపరైరి.

2. షేక్స్పియరు.

సిడ్నీ తరువాత నింగ్లీషు విమర్శకులలో నెన్నఁదగిన వాడు. షేక్స్పియరు మహాకవియే." షేక్స్పియరు గొప్ప నాటకకర్త.