పుట:2015.372978.Andhra-Kavithva.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

5


తిరస్కారములు ఆత్మకుఁ జెందవని నమ్ము మనవేదాంతులకు నిగ్రహము సహజగుణమేకదా!

ఈగ్రంథరచనవిషయమున నాకుఁ బ్రేరకులయినట్టి శ్రీ వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రులుగారికిని, సహజముగఁ బాదుషాల కన్ననుగూడ 'బద్దకస్తుఁడ' నగు నాలోపములనెల్ల సర్దుకొని వచ్చుచు గ్రంథమునఁ జాలభాగము వ్రాసిపెట్టి మూలమును ప్రమాదరహితముగ సంస్కరించిన మన్మి త్రులగు శ్రీపొన్నలూరి సూర్యనారాయణశర్మగారికినిఁ గృతజ్ఞుఁడ నగుచున్నాఁడను. పరుల యభిప్రాయములఁ గైకొనునపుడెల్ల వారిపేరులఁ బొందుపఱచియేయుంటిని. కాని యెచ్చటనేనిఁ బ్రమాదవశమున నెవ్వరి పేరు లేనిఁ దెలుప మఱచితినేని యయ్యది గ్రంథ చౌర్యముగఁ బరిగణింపక ప్రమాదమాత్రమే యని కరుణాలసదృష్టితో రసజ్ఞులు వీక్షింతురుగాక!

ఈ గ్రంథమున కాచంద్రార్క స్థాయి యబ్బుగావుతమని గాని, నాకు సాహిత్యరసపోషణ బిరుదము లభించుఁగావుతమని'కాని కోరునంతటి ఛాందసుఁడఁ గాకపోయినను, సాహిత్యచరిత్రమును యథాశకిఁ బరిశీలించి సాహిత్యశ్రేయము నభిలషించుచుండినవాఁడ నగుటచే, నీనాఁటి పండితులలో జాలమందికి మదీయాభిప్రాయములు సంస్కారచ్యుతి సూచకములుగను మూలచ్ఛేదకములుగను గన్పట్టినను, వెనుకటికి మహాకవి భవభూతి