పుట:2015.372978.Andhra-Kavithva.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4


పోవు. అట్టివానినెల్ల రసజ్ఞులు నిష్పక్షపాతబుద్ధిం బరిశీలించి గుణలేశమునుమాత్రమే గ్రహించెదరుగాత!

రెండవవిషయము: పాశ్చాత్యవాసనలు నన్ను వీడక వెంటాడుచున్నను, భారతీయనాగరికతకునెల్ల మూలకందమనఁదగు సంస్కృతవాఙ్మయమును జుల్కనఁగఁ జూడక మూలాధారముగనే గ్రహించి సర్వత్ర వాదమునకుఁ గడంగితిని. కాని, సాంస్కృతికాలంకారికుల ప్రధానసూత్రమును మాత్రమే కయికొని, యప్రధానము లగు వానినెల్ల విడిచి సాహిత్యమునకును,రసమునకును, శైలికిని సంబంధించిన ముఖ్య సూత్రములచర్చతోడనే గ్రంథమును బూరించితిని. అప్రధాన విషయములఁగూర్చి విపులవ్యాఖ్యానము గావలసినవారికి పూర్వసంప్రదాయానుసారములగు లక్షణగ్రంథము లెన్నియేనియుంగలవు. 'చక్కనిరాజమార్గమే యుండఁగా సందుల గొందుల దూఱనేలనే యోమనసా!' యనుత్యాగరాజవాక్యమునేఁ ప్రమాణముగఁ గయికొని కావ్యతత్త్వాన్వేషణమున ముఖ్యసూత్రములనే యాధారముగఁ గొని రాజమార్గముననే నడువఁ బ్రయత్నించితిని.

ప్రసంగవశమున నెచ్చటనేనిఁ బ్రస్తుతపండితులఁగూర్చి, పరుషవాక్యములఁ బల్కియుంటినేని పండితులు దానిని వ్యష్టిపరముగ నన్వయించుకొని యాగ్రహింపక నేఁజేయువాదముతో సమన్వయముఁ గావించుకొనెదరుగాక! దూషణభూషణ.