పుట:2015.372978.Andhra-Kavithva.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము.

రసాత్మకం వాళ్యం గౌవ్యమ్.

35


నవి కవులపాలిటి శాసనములై నాటి వర్తింపరాని వయ్యెను. ఈ లింగవి భేదముల విచిత్ర పద్ధతులచే సమాసరచనలో నెన్నో కష్టములు సుభవించు చున్నవి. గణ విభజనము విషయమునను సంధి విషయమునను నమితములగు కష్టము లుత్పన్నము లగు చున్నవి.

3. వచనవి భేదము,

వచనవిభేదముల విషయమునఁగూడ నిట్టిచిక్కుల ననేకముల వైయాకరణులు కల్పించియున్నారు. సంస్కృతమున వచనములు ఏక - ద్వి - బహువచనము లనుమూఁడువిధములుగ నుండుటయేగాక యనేకశబ్దములు నిత్యబహువచనాంతములు గనో, నిత్యై కవచసొంతములుగనో, నిత్యద్వివచనాంతములు గనో యుండుటకూడ సంభవించి గోరుచుట్టుపై రోఁకటి పో టన్న భంగి యీ వరకున్న కష్టములకుఁదోడు కొత్తవి కలుగు చున్నవి. ఇట్టి విచిత్ర పద్దతులను గల్పింపఁబడిన వచనాంతవిభేద ములనెల్ల వల్లెవేయ 'నిది కవితఁ జెప్పఁగడంగుట సాహస కార్యమే యగుచున్నది. ఈవిచిత్ర వ్యాకరణ విశేషముల నన్నిటిని నేకరువు పెట్టుసరికి యున్న సాహిత్యాభిరుచి కొంచెమును గవితోద్రేకమును నశించిపోవును.

విభక్తులు, కాలవి భేదములు.

ఇఁక విభక్తుల విషయమును భూత - భవిష్య - ద్వర్త మాన శాలవి భేదముల విషయమును గష్టముల కాస్పదములగు చున్నవి. ఒకవిభ క్తియర్గమున నింకొకవిభక్తి యుపయోగింపు బడు నియమములును, నొకకాలమును సూచించుటకై వేరు