పుట:2015.372978.Andhra-Kavithva.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14

ఆంధ్ర కవిత్వచరిత్రము

ప్రథమ


కించిజ్ఞులకుఁగూడ నతిసులభముగఁ దోఁచును. నిర్మాణము నిర్మాత యనుపదములు సాధారణముగ గృహనిర్మాణమునకును, గృహని ర్మాతలకును జనులు వర్తింపఁ జేసెదరు. గృహనిర్మాత యెట్లు రాలు, సున్నము, కలప, దూలము లాగాఁగలపరికర ముల నాయత్తముఁ గావించుకొని పునాదుల బాగుగఁ ద్రవ్వి వానిపై స్థిరమగు గృహమును నిర్మించునో యట్లే కావ్య నిర్మా తయు భాపములు, శబ్దార్థములు, అలంకారములు, శయ్యా రీతులు, ఆదిగాగల కావ్యపరికరములఁ గయికొని కార్యసౌధ మును నిర్మించునని యీమతమువారియభిప్రాయము. కావ్య నిర్మాణమునను, గృహనిర్మాణమునను విబ్రమాశ్చర్యము లుదయింపఁ జేయంజాలు సనంతసృష్టి వైభవము గాన కాకున్నను, చేతనున్న పరికరములను దగినరీతి నుపయోగించి యొకసర్వాంగ సుందరమును, బరిపూర్ణమును, నగు కావ్యమునుగాని, సౌధ మునుగాని నిరింపఁగలశక్తి ప్రదర్శిత మగు చుండును. కావ్య - నిర్మాత దృష్టి సర్వప్రపంచమును గబళింపఁగలుగునంత విశాల మయినది కాదుగాని యున్న దానిని బూర్వోత్తరవిరోధము లేకుండ, నంగాంగములపొందిక తప్పకుండఁ బరిపూర్ణ ముగ నుపలక్షించుశక్తి , గలదియైయున్నది. కాళిదాసాదికవి శ్రేష్ఠు - లెల్లరు నీ కావ్య నిర్మాతృవర్గమునఁ జేరినవారు.

కావ్య కారుఁడు.

ఇప్పుడు మూఁడవదియుఁ బై రెండింటికన్నఁ దక్కుఁగల దియు నగు కావ్య శారపదమును జర్చింతము. “కావ్య కోరుఁడు' అనుపదము స్వర్ణ కారుఁడు, కుంభ కారుఁడు, ఘటకారుఁడు మొదలగుపదములతో సామ్యము నందఁగల్గుచున్నది. సాధా