పుట:2015.372978.Andhra-Kavithva.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము.

రసాత్మకం వాక్యం కావ్యమ్

18


ప్రపంచమును నిర్మించును గావునఁ గవి నిశ్చయముగ రెండవ బ్రహ యనుటకుం దగినవాఁడనియు కవి బ్రహ యను నామము నకు దగినవాడనియు నిర్ధారణ మగుచున్నది. సృష్టి అనంతము ప్రతిఫలా పేక్ష నించు కేనియును సృష్టికర్తకు నాషాదింప జాలము. బలవత్తరములగు కారణములుగాని, హృదయము నాకర్షించు ఫలాపేక్షగాని, లేక పరమేశ్వరుఁడు ప్రపంచమును. సంకల్పమాత్రమున నానావిధజంతుసం తానముతోడను, బంచ భూభౌత్మకముగను నిర్మించెను. అట్లే కవియుఁ బ్రత్యక్ష కార ణము లేవియు లేక ప్రతిఫలాపేక్ష యించు కేనియు లేక కావ్య మును, నందు వివిధ ప్రకృతులను వర్ణించి సర్వవిధములఁ బరి పూర్ణమైయొప్పు ప్రపంచమును గావ్యమునఁ బ్రదర్శించు చున్నాఁడు. బాహ్య సృష్టియందుంబ లెఁ గావ్యసృష్టి యందును ననంతమును, నపారమును నగుశక్తి ప్రదర్శితమగు చుండును. విషయబాహుళ్యము గవి బ్రహల గ్రంథముల బాగుగఁ గొన నగును. మహాపురాణములను, నందందు యుగయుగములఁ బ్రపంచములను వర్ణించి, విపులముగ సమర్థించిన వ్యాసవాల్టీ క్యాదిమహాకవులు నిశ్చయముగ నీకవి బ్రహ్మపదవి నధిష్ఠింప దగినవారు. అట్టి వారి కావ్యసృష్టి వలన నే నేటివఱకును మన మాత్మోపలబ్దిని బడయుచు సర్వవిధముల జీవితమును ఫలవంత ముగం గావించుకొనఁగలుగుచున్నాము. ఈవిషయమును. మున్ముందు నింకను విపులముగఁ జర్చిం చెదము.

కావ్య నిర్మాత.

ఇకఁ గావ్య నిర్మాత యనుపదమును గొంచెము విమర్శిం తము. నిర్మాణ కౌశలమనఁగా నెట్టి? ఈ ప్రశ్నకుఁ బ్రత్యుత్తరము