పుట:2015.372978.Andhra-Kavithva.pdf/273

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

256

ఆంధ్ర కవిత్వచరిత్రము

షష్ట


చుండునో అట్లే వివిధ రసములును వాని కనుగుణములగు కవి హృదయములఁ బాఱుచుండును. చవిటి నేల నెంత బలము చేసినను నెన్ని రకముల యెరువులఁ గట్టినను పంట పండునే? దుర్గంధమును, క్రిమికీటకాదులును జన్మించునుగాక. అంతియే. అట్టి రసములు ఆయారసముల కనుకూలము కాని హృదయమున ప్రవహింప నేరవు. అట్టి హృదయ క్షేత్రము లెన్ని కావ్యముల పఠనమువలననై సను, ఎన్ని లక్షణ గ్రంథముల పఠనమువలననే నను రసవంతములగు కావ్యఫలముల నీఁజాలవు. ముసిఁడి పండ్లు వోలె జూచుట కింపై నోటఁ బెట్టుకొన్న విషప్రాయములుగ నుండు ప్రబంధముల నీజాలు నేమో! -

కౌవ్యమున శయ్యా రీతు లప్ర ధానములు.

-

ఈ రసరహస్యము నెఱుఁగని లాక్షణికులు కొందఱు “రీతి రాత్మా కావ్యస్య"యనియు, “అదౌషా, సగుణ్, సాలం కారౌ, శబ్దార్థౌ, కావ్యమ్” అనియు వచించి యున్నారు. తత్ఫ లితముగ రీతులును, వృత్తులును, నలం శారములును కావ్యముల మిక్కిలియైనవి. శయ్యారీతులును, రసవృత్తులును, నలంకారము లును నున్న యంతనే రసవంతమగు కావ్య ముద్భవించునే ? "అంగడిలో సన్నియు నున్నవి.అల్లుని నోటశనియున్న "దన్నట్లు, రీతులు, వృత్తులు, అలంకారము. లాదిగాఁగల బాహ్యచిహ్న ములే మిగిలి, కావ్యాత్తయగు రసము మాయమై పోయినది. అగుఁగాక, రస మిట్టి పై పై వన్నె లుపచరించుట వలనఁ గలు గునే! ఆయ్యది కవిహృదయాంతర్గతభావోద్రేకమువలన జనింప వలెను. అట్టి భావోద్రేకము ప్రతిభా శాలురకే జనించునుగాని నీచులకును, ద్రోహాత్తులకును గలుగనేరదు. “He who would not be frustrate of his hope to write well hereafter in laudablo