పుట:2015.372978.Andhra-Kavithva.pdf/272

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము,

భావప్రకటనము.

255


సోదరుఁడై వీరయుగమున జనించి, మనుమసిద్దికిని కాటమ రాజునకును పంచలింగాల క్షేత్రమున జరిగిన మహాయుద్దమును, బ్రహ్మరుద్రయ్య పద్మనాయ కాది వీరాగ్రేసరు లెదిరిషక్షమున నిలిచిపోరు చుండ వీరాధి వీరుఁడును సోదరుఁడును నగు ఖడ్గతిక్కనతోఁ గూడి కదనమున పాల్గొనిన తిక్కనకవి యోధ వీరరస మును వర్ణింపవ లెఁగాక తక్కొరులకుఁ జేతనగు నే! నాటకమున శృంగార వీరరసముల దక్క నన్యముఁ బ్రథానరసముగ వర్ణింప దగదని శాసించిన లాక్షణికనియమమును బూరికిఁగొనక స్వచ్చందరస ప్రవృత్తిని నిరోధింపక, “ఏకో రసః కరుణ ఏవ" యనిసమ్మి,సమకాలిక పండి తాపహాసములకు వెఱఁగొంద క " కాలో హ్యయం నిరవధిర్విపులాచ పృథ్వీ" యని ఘోషించిస్వాతంత్ర్య ప్రతిభఁ గనఁబఱచి "ఉత్తరే రామచరితే భవభూతి ర్విశిష్యతే | యను నార్యోక్తిచే శాశ్వతస్థాయిగాల కీర్తింపఁబడిన భవభూతికే శ్రీ రాముని కరుణరస భరితమగు చరిత్రమును నాటకమును వర్ణించుటకుఁ జెల్లెనుగానీ తక్కోరులకుం జెల్లేనే శృంగారరస మూర్తియై, రసిక శిఖామణియై, సరస్వతీ దేవ్యవతార మై వాక్సిద్ది కలిగిన కాళిదాసకవికిఁ గాక యన్యులకు శృంగారరసము నంత చక్కగా వర్ణింప సాధ్యమయ్యె నే! ఒక చేత నగ్నిహోత్రమును నింకొక చేత మంచుగడ్డను బట్టిన మనుజునిరీతి "ఇదం బ్రాహ్య మిదం ఔత్రం" అని పల్కిన పరశురాముని రీతి హాస్యరసమును విషాదరసమును నొక్కరీతి నొకదాని వెంబడి రెండవదానిని వర్ణించి, హాస్యరస భరితనాటకములను, విషాదాంతనాటకము లనుగూడ రచించి కీర్తింబడయుట యొక్క షేక్స్పియరునకు . గాక యన్యుల కెల్లరకుం జెల్లె నే? కావున నుదాహరణము లనవసరములని విన్నవించుట, నీళ్లు ఎట్లు పల్ల మెఱింగి పొరు