పుట:2015.372978.Andhra-Kavithva.pdf/261

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

244

ఆంధ్ర కవిత్వచరిత్రము

షష్ట


సరించి భిన్న దశల నొంది యనేక భాషలుగఁ బాదుకొనిపోయి నది. ఇట్టి భాషలలోఁ గొన్ని ప్రాంతఁగలవిగను, గొన్ని ప్రాంత లేక వాజ్మాత్ర వ్యవహారము గలవిగను నున్నవి. ఈవిషయ మిట్లుండె. ప్రకృతము మనకుఁ గావలసిన విషయ మేమనఁగాఁ బతిమాటయుఁ బైన వివరింపఁబడిన కారణము ననుసరించి యొక యర్థమునకును బదార్థమునకును సంజ్ఞా రూపముగ నుండు ననియే. కావునఁ బ్రతిమాటయు నొక్కొక్క యర్థము నొసఁగ సమర్థమై యుండును. ఏతావతా ప్రత్యర్థమును బదములవలన సూచింపఁబడవలేననియే స్పష్టమగు చున్నది. మాటల చే సూచింపంబడని యర్థమును, నర్థమును సూచింపని మాటలును మృగ్యములు. కాని కుశాగ్రబుద్ధులు వేదొక ప్రశ్నను నడుగుదురు.


-అనుకరణముల విషయము.

అర్థము నొసంగని మాట "లేదందు రే! అనుకరణముల సంగతి యేమి? అని ప్రశ్నింతురు. 'కొక్కొరుకో' యనుమాట, కర్ణ మేమి? బౌ బౌ బౌ 'అనుట కర్ణమేమి? కజకజగజగజు. ఉహుహూ అహహా మొదలగు సనుకరణముల సంగతి యే మందురు ? వాని 'కేమియర్లము నీయఁగలరు? అని ప్రశ్నము గల్గుచున్నది, దానికి సమాధానముఁ దెల్పెదను. ఈయనుకర ణములు మిగిలిన పదములవలననే యర్థమునకు సంజ్ఞారూపము గనే యున్నది. మానవ వ్యవహారమున వీనికి రూఢియగు ప్రసక్తి కల్పించేంబడియే యున్నది. 'కొక్కొరొకో యను కూఁత ఒక్క కోడివిషయమున నే వాడుచున్నా రేమి? మానవ వ్యవహారమునఁ గొక్కొరొకోయను ననుకరణము కోడివిషయ