పుట:2015.372978.Andhra-Kavithva.pdf/260

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము.

భావప్రకటనము.

243


శృతినే యున్న దిగాని, నిరాకారముగ లేదు. పదార్ధ మున్నచో నాకారము తప్పక యుండితీరవలయును. ఆకృతి లేని పదార్థములును, పదార్థము లేని యాకృతులును బ్రకృతియందు దుర్లభములు. నిరాకారత ఒక్క వాయువునకును నద్వైతపర బ్రహ భావమునకును వర్తించును. తుట్టతువకు వాయువులకుగూడ నొకవిధమయిన రంగున్న టులఁ బ్రకృతిశాస్త్రజ్ఞులు కన్నులకు దార్కాణముగఁ జూపించుచున్నారు. పర బ్రహముపంగతి కొంచెము వాగతీతము. ఏలనన, భగవంతుఁడు నిరాకారుఁడని సమ్మువారు కొందఱును, సాకారుఁడని కొందఱును నమ్ము చుందురు గావున నీవిషయమును గూడ నీదమిత్థమని తేల్చుటకు వలనుపడదు. కావునఁ దేలినవిషయ మేమనఁగాఁ, బ్రతివిషయ మునకును బ్రత్యేకమగు నాకృతి యుండుననియే, అయ్యది గ్రహించి వర్ణించుటయే కవియొక్క కృత్యము.

భావములయొక్క ప్ర త్యేకస్వరూప మే పదజాలము.

ఇట్లే ప్రతిభావమునకును బ్రత్యేక స్వరూప ముండునని మామతను. భావములకుఁ బ్రత్యేక స్వరూపము పదము లేయని యెఱుంగునది. ఎట్లనఁగా పేరు లేని వస్తువుండ నేరదు. 'పిల్లి' యను పదమువలనఁ బిల్లియను పదార్థమునకు సంబంధించిన భావ మును బిల్లియను బదార్థమును 'రెండును స్మరణకు వచ్చు చున్నది. కావునఁ బదము విషయమునకును, విషయసంబంధి భావమునకును సుజారూపమున నున్నది. ఈసంజ్ఞలు విషయ పరిజ్ఞానము సులభముగ నలపడుటకును, శాశ్వతముగ నుండుటకును, సర్వత్ర వ్యాప్తి గాంచుటకును మానవుని చేర బ్రప్రథమమున నేర్పఱుపంబడి దేశకాలపొ త్రాదుల సను