పుట:2015.372978.Andhra-Kavithva.pdf/259

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్ర కవిత్వచరిత్రము

షష్ట

242

________________


టచేఁ జర్చఫలితము వేజురూపముఁ దాల్చినది. ఇచ్చట నావిష యము నే వేఱుదృష్టితో నవలోకించి చర్చిం చెదము. పదార్థమును దానియొక్క స్వరూపమును భిన్న ములుగా వనియు, నేక మేయని యు వస్తువున్నపుడు దానికిఁ బ్రత్యేకస్వరూప ముండియే తీరవల యుననియు, వస్తువునకును స్వరూపమునకు నవినాభావ సంబంధ మున్న దనియు నట్లు ప్రతివస్తువునకు నుండు ప్రత్యేకస్వరూప మును కనుంగొని వర్ణించువాఁడే నిజమగు కవియనియు నిచ్చటఁ దెలుపుచున్నాము. ఒక చిన్న యుదాహరణము నిచ్చెదను. ఒక రాలగుట్టను గాంచుఁడు. అం దెన్నేని రాళ్లుండునుకదా? ఒకజాతికిని నింకొక జాతికిని సంపూర్ణమగు పోలికయు,స్వరూప మునందు సంపూర్ణమగు నైక్యమును నుండదుకదా? ఒక్కొక్క రాతికి నొక్కొక్క ప్రత్యేకస్వరూప ముండును, ఆప్రత్యేక స్వరూపము కన్ను లఁగాంచిన ప్రతివానికిని గోచరింపకమానదు. మనము చూచినను జూడకపోయినను నేజాతియొక్క స్వరూప మారాతికి నుండ నేయున్నది. మనము ఏదో ప్రసక్తి వలన దానిని గాంచుటయు, దాని స్వరూపమును గుర్తెఱుంగుటయు, దానిని వర్ణించుటయు సంభవించుచున్నది, వస్తువు యొక్క స్వరూప మును గుణవిశేషములను వర్ణించుటకొఱకు మనము నిమిత్త మాత్రుల మగుచున్నాము, శాస్త్ర కారుఁడు వస్తువున కుండు ప్రత్యేకస్వరూపమును బ్రధానముగా వర్ణింపక ముఖ్యములగు గుణవి శేషములను మాత్రమే పేర్కొనును. శిల్పియన్ననో, రసి కుఁడు నన్ననో, వస్తువు యొక్క ప్రత్యేక స్వరూపమును బ్రధాన ముగ గ్రహించి వర్ణించును, వస్తువును దాని స్వరూపమును నభిన్న ములని తిరిగి హెచ్చరించుచున్నాను. ఎట్లనఁగా, జాతి యందున్న పదార్థమగు సణుసముదాయము ఏదోయొక యా