పుట:2015.372978.Andhra-Kavithva.pdf/257

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

240

ఆంధ్ర కవిత్వచరిత్రము


సహజములుగాని విషయముల వర్ణించునపుడు కవి యొకనియమము ,పొటింపవలెను. కొంత సేపు విషయము స్వభావాతీతము గను ఆలోకసహజముగను నున్నట్లు వర్ణించి, వెంటనే యింకొకచోట దానికి స్వాభావికములును లోకసహజములును నగు గుణవి శేషములను గల్పించి వ్రాయఁజూచుట యాచిత్య భంగ హేతువు, పరస్పర వైరుధ్యము లేనంతవఱకు నెట్టిస్వభా వాతీతవిషయవర్ణనమైనను నెట్టి యలౌకిక సహజరూపకల్పన యైనను బొసఁగుననియు రసాభాస హేతువులు గాపనియు విన్న 'వించుచున్నాను.

పొరాంశము.

కావున నింతవజకుఁ దేలిన దేమనఁగా? కావ్యము రసాత్మకమనియు,రసము భావానుభూతియే యనియు, అట్టి భావాను. భూతి భావనాశక్తియను నింద్ర జాలమహిమచే లబ్ద మగునని యునే. ఈ భావనాశక్తి యొక్క మహిమను నెంత వర్ణించినను వర్లింప వలయుననియే యుండును. ఎన్ని యుదాహరణములు చూపినను నింకను గావలయుననియే యుండును, అందులకనియే. యమేయభావనాశ క్తియుతులగు కవులు మితభాషణముచే విషయమును వర్ణించినట్లు ప్రతిభా శూన్యుఁడనగు 'నేను మిత భాషణమువల్ల సూచించుటతో మాత్రమే తృప్తి నొందెదను. భావనాశ ! కవికిమాత్ర మే సొముగను, బలముగను, అండగను నుండి యతనికి గాప్యనిర్మాణ విషయమునఁ గృష్ణసారథ్యముం బోలె సహాయకారియై యుండునని తెల్పి యింతటితో నీ ప్రశం సను ముగించెదను. --