పుట:2015.372978.Andhra-Kavithva.pdf/258

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠ ప్రకరణము.

1. శైలివిషయము.

ఈ కావ్యము రసాత్మకమనియు, రసము భాఏనుభూతియే యనియు, నట్టి భావానుభూతి భోపనాశక్తియను నైంద్ర జాల ప్రభావముచే జనించుననియు నింతవరకుఁ దెలిసికొంటిమి. కావ్యాత్మ యగు రసమును గూర్చియు, ప్రాణమగు భావనాశక్తిని గూర్చియు విచారించితిమి. ఇప్పు డాకావ్యాత్మయుఁ, గౌవ్య ప్రాణమును నెట్టి స్వరూపము దాల్చునో సూచించెదము, అనఁగా, కావ్యముయొక్క బాహ్యస్వరూప 'మెట్లుండవలెనో యను సం గతిని విచారిం చెదము. కావ్యపదార్థ మనందగు భావముల కును వాని స్వరూపమనందగు శైలికినీ సంబంధ మేమి కలదో విచారింతము,

పదార్థమునకు స్వరూపమునకుఁ గల సంబంధము.

రసస్వరూపచర్చ యను ప్రకరణమున నీవిషయమును గొంతవఱకుఁ జర్చించీయే యుంటిని. అచ్చట వస్తువునకును గుణవి శేషణములకును నభిన్నత్వమును నవినాభావ సంబంధమును వర్తించునని సోదాహరణముగ నిరూపించితిని. కాని యఁట చర్చనీయాంశము వస్తువు యొక్క గుణవి శేషములు మానవ కల్పితములా, లేక వస్తువునం దంతర్గర్భితములా? యనునదియగు ఆంధ్ర కవిత్వ--16