పుట:2015.372978.Andhra-Kavithva.pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

224

ఆంధ్ర కవిత్వచరిత్రము

పంచమ.


మును దర్శించి, దాని మహత్త్వమును గురైఱింగి దాని ప్రభావము ననుభవించి, దానియొక్క తేజము గని, స్తంభితుఁడై, తెలివి నొందిన పిదపఁ దాను గాంచిన యాదివ్యమూర్తిని, చైతన్యమును, ప్రాణవంతముగను 'తేజస్సహితము గను వర్ణించును. అట్టిమూర్తులు మఱవరానంత పరిస్ఫుటాకృతులఁగలిగి మన కన్ను లయెదుటఁ దొండవించుచునే యుండును. ఊహాశక్తి గల కవు లట్టి దివ్య చైతన్యమును గాంచ లేక యూరక పై పై మెఱుఁగులఁ బచరించుటతోడనే తృప్తిఁ జెందుదురు. ఈసత్యమును గ్రహించియే వర్డ్సువర్తు కవి తన కావ్యముల ననవసరవర్ల నములకుఁ దావీయక విషయముయొక్క చైతన్యమును మాత్రమే ప్రకటము గావించుచుండెను. ఈ సత్యమును గ్రహింపజాలకుండిన యప్పటి యాంగ్లేయ విమర్శకులు వర్డ్సువర్తు యొక్క కావ్య శైలి పేలవమనియు నలం కారశూన్యమనియు నాక్షేపించిరి. కాని కాలమే వారి వాద దౌర్భల్యమును, వర్డ్సువర్తుకవి యొక్క ప్రతిభను సమర్థించినది.

తియోడర్ వాట్సుడంటను పండితునిమతము. సర్వస్వతంత్ర భావనాశ క్తికిని పరిమితభావనా శక్తికిని గల భేదము

.

Encyclopaedia Brittanica (ఆంగ్లేయ విజ్ఞానసర్వస్వము) అను గ్రంథమున కవిత్వ మనువిషయమై యమూల్యమగు వ్యాస రత్నమును రచించిన Theodorawatts-Dunton (త్రియోడర్ పొట్సుడంటన్) అను విమర్శక శేఖరుఁడు భావనాళ క్తి విషయమున నింకొక విభేదమును సూచించినాఁడు. అతఁడు భావనా శక్తి Absolute Imagination, Relative Imagination అను రెండు