పుట:2015.372978.Andhra-Kavithva.pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము.

భావములు భోపనాశక్తి.

223


పోయునట్లు పోతఁబోసి యప్రధానవిషయములను విసర్జించి ప్రధానగుణములే మూర్తీభవించి ప్రాణవంతమగు రూపముఁ దాల్చునట్లు వర్ణించును. ఊహాశక్తిగల కవి యన్ననో యట్టి భిన్న త్వాతీతమగు నేకత్వమును, రసమును, సౌందర్యమును జీవమును గ్రహించి యనుభవించి వర్ణింపంజాలక యూహల బన్ని వస్తువు యొక్క విశేషణముల నొకదానివెంటఁ నొకటిఁ బేర్కొనుచు వస్తువు యొక్క మూర్తిని సాక్షాత్కరింపఁ జేయ లేకుండును. ఇతఁడు ప్రాణ ప్రతిష్ఠఁ జేయఁగల కవి బ్రహకాడు.భావనా శక్తియుతుఁడగు సత్కవి ప్రాణప్రతిష్ఠ జేసిన విగ్రహ మునకు నీయూహాశ క్తిగల కవి నగిషీఁ జెక్కి యలంకారముల నొడఁగూర్పఁ బ్రయత్నించును. కాలునేతులకుఁ దొడవులును, వస్తాద్యలం కారములను గూర్చి, వివిథావయవములకు నాభరణ ములను గూర్చి యాభరణములును, దొడవులును; నలంకార ములును దక్క మూర్తియొక్క సొగసుఁగాని, నిసర్గ సౌందర్యముఁగాని, జీవశక్తిగాని, తేజముఁగాని గనుపింపకుండఁ జేసీ చింపిరిగుడ్డల బరువుతోఁ దలయాడించు గంగి రెద్దులయట్టి యాకృతులను నీయూహాశక్తిఁగల కవి వర్ణించును.

భావనాశ క్తిగలకవి యాకృతిని, నూహాశక్తి, "గలకవి వస్తుగుణవి శేషములను వర్ణించును. "

భావనాశ క్తిఁగలకవి యాకృతిని నిర్మించుటకై ప్రయత్నిం చును. ఊహాశ క్తిగల కవి వస్తుగుణవి శేషముల వివరించుటకై తొక్కిసలాడును భావనాశక్తిఁగల కవి వస్తుగుణముల కతీ తమై సామాన్యమానవళాస్త్ర దృష్టి కగోచర మై దివ్య ప్రభతో వెలుఁగుచు వస్తువునకు జీవమును దేజమును నొసఁగు చైతన్య