పుట:2015.372978.Andhra-Kavithva.pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

222

ఆంధ్ర కవిత్వచరిత్రము

పంచము


వాదమునందలి సత్యమును గ్రహించి కావ్యపరమార్థమును గుర్తెఱింగిన నంతియే చాలును.

పాశ్చాత్యుల సిద్ధాంతము, వర్డ్సువర్త్ ' భావనాశక్తి యేకత్వమును, నూహాశక్తి ఆయనేకత్వమును సూచించును.

ఊహాశక్తికిని, భావనాశ క్తికిని పాశ్చాత్య విమర్శకులు వొక భేదవి శేషమును సూచించిరి. అదెద్దియన భాషనాశక్తి విషయమును ఒక్కటిగ నుపలక్షించును. ఊహాశక్తి విషయ మును వివిధ విభాగములు గలదిగ నుపలక్షించును. ఈభావమును * వర్డ్స్ వర్త'ను కవి తన విమర్శనవ్యాసముల వివరించెను. దీనిభావ మేమనఁగా, భావనాశక్తి గల కవి విషయములయందు అనఁగా వస్తువు యొక్క గుణవిశేషములయందుఁ గల యేకత్వ మునే దర్శించి దానిని ఏకప్రాణముగల వస్తువుగనే వర్ణించును. భావనాశక్తిఁగల కవి కుప్ప తెప్పలుగఁ బడియున్న రాలగుట్టల యందును, నడ్డదిడ్డముగఁ 'బెరిఁగియున్న యటవీ వృక్షముల యందును, గిచగిచ... కిలకిల -- కలకలమని యొక నియమమును రీతియు లేని పక్షిసమూహముల గానములయందును, రసమును, సౌందర్యమును, జీవమును గ్రహించి యనుభవింపం గలుగును. అట్టికవికి నెట్టి భిన్న గుణములుగల వస్తువునందైనను బరిస్ఫుటమగు రసమును, సౌందర్యమును, భావవి శేషమును గన్పట్టుచునే యుండును. అట్టికవికి నసహ్యమును, సౌందర్య రహితమును, జీవశూన్యమును నగు 'వస్తువు ప్రపంచమునఁ గంపడనేకన్పడదు. అట్టికవి వస్తువు యొక్క విశేషములనన్ని యుఁ లోహకారుఁడు లోహమును గరఁగించి యొకయచ్చునఁ బోఁత