పుట:2015.372978.Andhra-Kavithva.pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

218

ఆంధ్ర కవిత్వచరిత్రము

పంచమ


నిశ్చలసత్యముతో జతఁగూడిన
నెంతోశ క్తివంతంబగు ప్రేమము
దేవతలైనను దాని థాటికిని
లోబడి పోవలసినవారే,
చపలము వికటము సుండీ ప్రేమము
చంపెడు నొకమాటే యొకచూపే,
కావున జాగ్రత కాముకులారా!
యేవిధిఁ బ్రేమల మెలఁగెదరో!

ప్రణయము యొక్క శక్తిని నామే యెట్లు వర్ణించినదో!

ప్రేమమును సత్యమును జతఁగూడిన దేవత లైనను లొంగి పోయెద రనిన దానియొక్క శక్తని వేరె వర్ణింపవలయునా !'ప్రేమరియొక్క చపలస్వభావము నామె యెట్లు వర్ణించినదో ! ఒకమా బే, ఒకచూపే చం పెడునన్న చోఁ జేమయొక్క చాప ల్యము వేతే వర్ణింపవలయునా? ఒకచూపునకు బ్రమసియే,, యొకమాటకు మురిపెము నొంది యే, యేందఱు ప్రణయినీ జనులు బ్రేమోపహతులగుట లేదు ! ప్రణయభావస్వభావ మును, ప్రణయినీజనుల చిత్తవృత్తియొక్క వై చిత్ర్యమును నెంత ఛప్తముగాను 'సింత హృదయంగమముగాను వర్ణించినది? అందుకనియే యీ మేకవిత్వమును విమర్శించుసందర్భమున (Theodorewatts.Danton) తియోడరు నోట్సు డంటును' అను నాంగ్లేయవిమర్శకుడు. నుడివిన వాక్యముల నిటఁ బొందుపటు పక మాసంజులను, "Never before these songs were sung, and never since did the human soul, in the grip of a fiery passion utter a cry like hers; and, from the executive point of view, in directness, in lucidity, in that high, imperious.