పుట:2015.372978.Andhra-Kavithva.pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము.

భావములు భావనాశక్తి.

217


మన్యుని శౌర్వము కౌరవవీరుల నెట్లు కన్నుల మిఱుమిట్లు: గొలిపించెనో యట్లే మనలఁగూడ గన్నుల మిఱుమిట్లు గోలిపి స్తంభితులఁ గావించుచున్నది. అట్టి మితవర్ణ నాశక్తి , భావనాబలమునను, విషయసాక్షాత్కా రమువలనను, కనిసహజ మగు దివ్య ప్రభావమువలనను లభ్యము కావలసిన దేశాని యూహాశక్తివలనను, బాండిత్య బలమునను లభ్యము కాదు. అందుకని “జన్మనా జాయ తే కవి:” యనుసూత్రమును పాఠ కులకుఁ దిరిగితిరిగి, పదేపదే, విన్నవించుట. "అధిప భీష భానుఁ డస్తమిం చె”యను మాటలలో భీష్ముని మహాప్రతాపమును, సతని గాంభీర్యమును, నతనిపడుట వలన జనించిన మహద్విచారమును సర్వమును వర్ణించిన తిక్కన యమేయకవితా ప్రభావము సర్వలోకసంభావ్యమకదా !

-శాఫో కవయిత్రి.

పాశ్చాత్యకవులలో నెల్ల శాఫో యను గ్రీకు దేశపు కవ యిత్రి యీమిత భాషణమును, నీసం గ్రహవర్ణనాశక్తిని విశేషముగఁ బ్రదర్శించినది. ప్రణయస్వభావమును ' నామె వర్ణించిన విధంబుఁ గాంచుఁడు..

 Love is so strong a thing
The very gods mast yield
When it is welded fast
With the unflinching truth,
Love is so frail a thing A
word, a look will kill
Oh lovers, bavaa care
How ya do deal with love