పుట:2015.372978.Andhra-Kavithva.pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూస:Hr

అనఁగ భావనాశూన్యతయే. ఆంధ్ర కవులలో నెల్ల భావనాశ! ప్రదర్శకమగు మితభాషిత్వమునఁ దిక్కనయు, వేమనయు ముఖ్యులును నీడు లేనివారుసు. వారు వర్ణించు మూర్తిని గన్నులఁగాంచిన పిదపనే, అనఁగ విషయసాక్షాత్కార మైన తరువాతనే పర్లింతురు. అందుకనియే వారి వర్లనములయందు సఖ శిఖాదిపర్యంతవర్ణనము గన్పట్టదు. రెండుమూఁడుమాటలలో ప్రధానలక్షణములను వర్ణించి మన కన్నుల యెదుటఁ దాము వర్ణింపఁదలఁచిన విషయము యొక్క మూర్తిని బరిస్ఫుట రీతిని సాతాత్కరింపఁ జేతురు. తక్కుంగలవారో యట్టి భావనాశక్తి లేమి నూహాపోహములఁ గావించి యప్ర ధానవిషయముల జాబితాలను సమర్పించి మూర్తిని సాత్కరింపఁ జేయఁజాల కున్నారు. చూడుఁడు. ద్రోణాచార్యకల్పితమై పాండవవీరుల కెల్లరకు న భేద్యమై ధర్మ రాజునకుఁ బ్రాణభీతిఁ గొల్పిన పద్మ వ్యూహమును భేదించుటకై సాహసించి ప్యూహమున జొరబడిన యభిమన్యుని శౌర్యముసు, ధైర్యమును, గాంభీర్యమును, మహోత్సాహమును .దిక్కన మెట్లు వర్ణించినాఁడో!

ఆ. 'మెఱుఁగు మెఱసినట్లు మెఱపించి యరదంబుఁ
గర్ణి "కార కేతు కాంతిఁ జెలఁగ
సంపగముల గురుని నలయించి కడచి యిం
ద్రజుని కొడుకు మొగ్గరంబు సొచ్చే:

మెఱుఁగు మెఱసినట్లు” అని వర్ణించుటలో నభిమన్యుఁ డెంత వేగముతో నెల్లరకు దుర్నిరీక్ష్యుఁడై., ఎల్లరకన్నుల మీరు మిట్లు గొలిపి శౌర్య రాశియై పద్మవ్యూహమును భేదిం చుకోని పో రెనో యా తెఱంగు సువ్యక్తమై కన్ను లఁగట్టినట్లుండి యభి