పుట:2015.372978.Andhra-Kavithva.pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

206

ఆంధ్ర కవిత్వచరిత్రము

పంచమ

రామగిర్యాశ్రమములపొంతఁ ద్రిమ్మరుచున్న యక్షునకు భావా వేశమున నే కదా;

శ్లో. ధూమజ్యోతిస్సలిలమరుతాం సన్నీ పాతః క్వ మేఘుః,
" సుదీశార్థాః శ్వ పటుకరణైక ప్రాణిభిః ప్రాపణీయా:
ఇత్యాత్సు క్యాదపరిగణయః గుహ్యక స్తం యయాచే
కామార్తా హి ప్రకృతిశృపణా శ్చేతనా చేత నేషు.

అనుశ్లోకమున వర్ణింపఁబడినయట్లు చేతనా చేతనముల విషయ మయిన జ్ఞానము నశించెను ! ఇత్యౌత్సుక్యాత్ అనుపద ముననే యీభావము ధ్వనించుచున్నది. కాంతావిరహముచే నార్ద్రీ భూతమనస్కుఁడై మాసముల నెట్లో కడపుచు విచార మున మునింగియున్న యతనికి ధూమజ్యోతిస్సలిలమరుత్తుల యొక్క కలయికమాత్ర మేయయి ప్రాణశూన్యమయియున్న మేఘము. ప్రాణయుతముగను జేతనముగలదిగను నయి మాన వులయొక్క ప్రణయసందేశమును గొనిపోయి ప్రియురాం డ్రకు, విన్నవింప సమర్థతఁ గలిగినట్లుగను గన్పట్టుట భావావే ముమూలమున నేకద? 'భావౌత్సుక్యము గల్గినవారు పూర్వాపర ములును సత్యాసత్యములును బరిగణింపరు, కామార్తులు సహజముగఁ గృపణులగుట చేఁ జేతనా చేతనములయెడ విశేషము తర్కముఁ గావింపక భావమును విప్పి చెప్పుచుందురు. భావనయే ప్రధానాంశము. • -

జీవితమున భావనయొక్క ప్రయోజనము.

అట్టిభావన లేనిది ప్రపంచమున మహత్కార్యములు జరుగుట దుర్లభము. మనుజుఁ డెప్పుడును, దనవలె నితరులును భావపూరితులై యుందురని గ్రహింపనిచో, సమ్మనిచో, నితరు