పుట:2015.372978.Andhra-Kavithva.pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము.

భావములు భావనాశక్తి,

207


లతో సాంగత్యము చేయుటగాని, యితరులకుఁ దనభావమును విప్పి చెప్పుటగాని, యితరులను సత్కార్యాచరణమునకుఁ బురి కొల్పుటగాని యసంభవము. ఎదుటివాఁడు మంచివాడు గాడనియు, నతని స్వభావమునకును దన స్వభావమునకును నేసంబంధమును లేదనియుఁ దనకును నితరులకును నేసంబంధ మును లేదనియుఁ దా నొరులకుఁ జెప్పునదియు, నొరులు దన వలన వినఁదగునదియు నేమియు లేదని నమ్మువాడు కార్యో త్సాహముఁ జూప నశక్తుఁడై , నిర్వీర్యుఁడై, యైకమత్యమునకు సభ్యంతరముఁ గల్గించువాఁడై , ప్రయోజనరహితుఁడై కీడునే యాపాదించుంగాని, మే లెన్నఁడును జేయఁజాలఁడు. భాననం గలిగినవాఁ డెప్పుడును ముందుచూపే చూచుచు నెట్టి కార్య మును నిర్వహించుటకైన సాహసించును.

భావనాశ క్తి యన నేమి?

పై నఁ జెప్పఁబడిన భావనయొక్క విజృంభణమే భావనా శక్తి యగును. ఏప్రభావమువలన మానవుఁడు మానసికము లగు తనభావములు ప్రకృతియందుఁ బ్రతిబింబితము లగుచు న్నట్లుగాని, ప్రకృతియం దాకృతిఁ దాల్చినట్లుగాని భావించి యనుభవింపఁగలఁడో ఆశక్తియే, ఆ ప్రభావమే భావనాశోక్తి యనఁబరగును. భావనాశ క్తియొక్క స్వభావమునుగూర్చియు, దానియొక్క ప్రయోజనములనుగూర్చియు విచారణ గావిం తము. భావనాశ క్తియొక్క స్వభావ మత్యద్భుతము, భావనా శక్తిబలమున కవి యనేకములగు భావముల రూపసహితము లుగఁ గాంచి యనుభవించి యితరులకుఁగూడ నాభావములను రూపసహితములుగఁ బ్రదర్శింపఁజాలును. ఈ భావనాశ క్తియొక్క