పుట:2015.372978.Andhra-Kavithva.pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము.

భావములు భావనాశక్తి.

205,


గుణమగు రూపమును దాల్చియున్నట్లు గన్పట్టును. అదియే భావనయని మనలాతుణికులు వివరించిరి. పుష్పము సుగంధమును వెదఁజిమ్ముట వలన దారిని బోవువారికి దాని వాసన యనుభూత మగుచుండును. అట్లే సుఖదుఃఖాదిభావములయొక్క వాసన యితర విషయములకు సయితము వర్తిల్లు చుండును.ఎట్లనఁగా;దుఃఖము చే నావేశింపఁబడిన మనుజునకుఁ బ్రపంచము సర్వమును. దుఃఖపూరితముగ నున్న ట్లే గోచరించుచుండును. అది యొక యున్మాదమే కావచ్చును, ఒక వికారమే కావచ్చును. కాని అట్టిది మానవునకు సహజముగ ననుభ వములోనుండు నవస్థలలో నిదియే. తన భావమును మనుజుఁడు ప్రకృతి కారోపించును. తాను సంతోషముగనున్నఁ బ్రకృతియంతయు సంతోషముగ నున్నట్లే భావించుచుండును. తాను విచారముగనున్నఁ బ్రపం చము సర్వమును విచారమున మునింగియున్నట్లు భావించును. ప్రపంచము నిజముగ నట్టి సుఖదుఃఖములకు నేతదవసరముల లోనగునో కాదో చెప్పుట యప, స్తుతము. గ,హణీయాం శము మానవుఁ డట్లు భావించునా? భావింపఁ డా ! యనునవి మానవునకుఁ బ్రకృతి యాభావమును ననుభవించునట్లుగను దదనుగుణమగు రూపమును దాల్చియున్నట్లుగను గనఁబడు టయే ముఖ్యమగు విషయము. భావపూరితు లయినవార లనేకులు అట్లు భావించియున్నారు. అది యున్మాదమే కా నిండు. అట్టి యున్మాద మే భావన యగును. అట్టి యున్మాదము నకు రసికుల చరిత్రల యందును భావవూరితు లగువారి చరిత్రల యందును అనేకదృష్టాంతములు చూపవచ్చును. కాంతా విరహముచే స్రుక్కి యేక వర్ష ప్రపొసశీక్ష ననుభవించుచు