పుట:2015.372978.Andhra-Kavithva.pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్ర కవిత్వచరిత్రము

పంచమ

-204


ప్రకృతియు భగవంతునిచే సృజింపఁబడినదనియు నందును భగ వంతుని తేజము గలదనియు గహించి యనుభవించిన వాడే రసికుడగును. అట్లు గ్రహించినవానికిఁ జూచినతోడనే యే శరీరవికారమును నక్కర లేకయే సుఖదుఃఖాదిభావములు జనిం చుచునే యుండును. అటులనే జంతువుల విషయమునఁగూడ. ముద్దులొలుకు నావుదూడలనుగాని, గంభీరముగ నుండి మిగుల బలసిన యాఁబోతులనుగాని, రౌద్రరసస్ఫూర్తిని విడంబించు సింహమునుగాని, పడగ విప్పి యాడు నాగుఁబామునుగానీ, జూచినతోడనే యొకరకమగు భావము మనల నావేశించును. కావున భావమునకుఁ గారణము భగవద్ద త్తవిజ్ఞానమును, (అనఁగా మనశ్శక్తి) మనకును జరాచర ప్రకృతికిని గల రహస్య సంబంధమును, నని గ్రహించునది. అందుచే మనవారు విభావ మను వేరఁ బిలిచిన మానసికవి కారమే ముందనియు, మానసిక వికారమును బాహ్యముగఁ బ్రదర్శించు ననుభావము వెనుక వచ్చుననియుఁ జెప్పుట. విభావములు మూలకముగ భావము మనస్సునకుఁ దట్టి యనుభావములు మూలకముగఁ బ్రదర్శితము ' లగును. కావున నే మనశ్శ క్తియు జన్మాంతరసంచిత రసహృదయ మును లేనిది భావము జనింపదు. శరీరవికారములు భావమును గలిగింపజాలవు. భావము మనస్సున ననుభూతముగానిది పైకి ప్రదర్శింపఁబడ నేరదని మామతము. వీభావములు ముందు, అను భావములు పిమ్మట.

భావన యన నేమి?

భావములయొక్క జన్మప్రకారమును సూచించితిమి భావము మనస్సు నావేశించినతోడనే సర్వ ప్రపంచమును దదను