పుట:2015.372978.Andhra-Kavithva.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్ర కవిత్వచరిత్రము ప్రథమ .

6. కావ్యము కీర్తికొరకు, ధనార్జనమునకు, వ్యవహార ములఁ దెలుపుటకు, నశుభములఁ బోఁ జేయుటకు, నప్పటి కప్పు డమేయానందము గూర్చుటకు, భార్య బోలినడగుట నుపచే శించుటకు నేర్పడినది.

రెండవమతము.

1" ఇష్టార్ధములు అనఁగా నింపగు నర్థములు సమ కూర్పు పదజాలమే కావ్యము.

2. రసాత్మకమగు వాక్యమే కావ్యము.

3. కర్త, కారణసంబంధములగు నియమముల చే బద్ధము గాక, యితరములపై నా ధారపడియుండక నవరసశోభితమై ప్రొయికముగ సంతోష మొసఁగునదియే కావ్యము.

4. ఇంపగునర్థముల నిచ్చుశ బ్ద జాలమే కాస్య మనదగు.

లాక్షణికమతము,

ముస్తుందు వామన వాగ్బటాది లాక్షణికులమనము విమ ర్శింతము, లాక్షణికులమతమునఁ గావ్యమున నెచ్చటను, నేవిధ మగులోపమును లేకుండఁ గావ్యము సర్వలణలతముగ నుండవలయును లాక్షణికునకుఁ గాప్యమున నెచ్చోటను దోష ము గాన్పింపగూడదు. సర్వమును గుణవంతముగనే యుండ పలయు, అట్లు గావ్యమునందలి సర్వాంగములు నదోషములు గను సగుణములుగను నున్న ఁగాని, కావ్యమున రస ముండ నేర దని యిమ్మతమువారి యభిప్రాయము. కావ్యము సర్వాంగ సుందరమై రాఁతఁ జెక్కినట్లు, అచ్చు గుద్దిన ట్లా కల్పాంతము దేశ కాల పాత్ర జనితంబులగు నవస్థా భేదమ్ములకు లోనుగాక యేకరీతిని జిరస్థాయిగ నున్న చో బాగుండునని యెల్లరును