పుట:2015.372978.Andhra-Kavithva.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

134

ఆంధ్ర కవిత్వచరిత్రము

ద్వితీయ

కోర్చి, తుదకు నతని నిర్జించి, సీతను గైకొని యయోధ్య కరు థెంచి ప్రథమమున సగ్ని సాక్షిగఁ గొన్న యామెను దిరిగి యగ్నితప్తం గావించి స్వీకరించి నిర్వర్తిత ప్రతిజ్ఞుఁడై యుండును?

సీతా రాముల సౌఖ్యానుభవ వర్ణనము.

సీతారాముల ప్రణయము స్థాయీభావము నొందిన యంశ మును స్ఫుటముఁ గావించు శ్లోకముల రెండిటి నుదాహరించె దను. ఒకటి వారి సౌఖ్యానుభూతికి సంబంధించినది. మఱియొ కటి వారి వియోగమునకు సంబంధించినది. అందలి రసమును బాఠకులు గ్రహింతురు.

శ్లో. కిమపి కిమపి మంధం మందమాసక్తియోగా
దవిరళితకపోలైర్షల్పతోరగ్ర మేణ
అశిథిలపరిరంభ వ్యాపృతై కై కదోషో
రవిదితగతయామా రాత్రి రేవం వ్యగంసీత్.

ఈశ్లోకము భవభూతి కృతోత్తరరామచరిత నాటకము లోనిది. పూర్వము గోదావరీ తటస్థ నికుంజములయందు సీతారామచంద్రు, లనుభవించిన ప్రణయవ్యామోహము రామునిచే సీతాపునస్సంయోగకాలమున స్మృతిపూర్వకముగ వర్ణింపం బడినది. దీనిభావము తేఁటగ బోధించిన నిట్లుండును. సీతా రాము లిరువురును రహస్యముగ సరససల్లాపములాడు నవస్థ యిందు వర్ణింపఁబడినది. ఏమేమో మాటాడుకొను చుండిరఁట. ఆయాపు యాభావానురక్తి వారలకే గోచరింపవలయుఁ గాని, మనబోంట్లకు గోచరించుట దుర్లభము. అవిరళితకపోలులై -ఒకవరుస, యొకతీఱు.ఆనునది లేక యిష్టమువచ్చిన దేల్ల-- మనస్సునకుఁ దట్టిన దెల్లఁ బల్కుచు, సల్లాపములఁ గావించు