పుట:2015.372978.Andhra-Kavithva.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

132

ద్వితీయ

ఆంధ్ర కవిత్వచరిత్రము

నగు శ్రీజానకీ దేవిని శ్రీ రామచంద్రున కిచ్చునటు లేర్పాటు గావించెను. అనంతరము ఆర్యపద్దతిని జనకుఁడు:

 "ఇయం సీతా మమ సుతా సహధర్మచరీ తవ,
ప్రతీక్ష్య చైనాం భద్రం తే పొణిం గృహీష్వ పాణినా.”

యను వచనములఁ బలుకుచు సీతను శ్రీ రామచంద్రమూర్తి కర్పించెను. నాటనుండియు వారిరువురకును బ్రణయమభివృద్ధి జెందెను. తుదకుఁ బినతల్లియగు కై క్లయితంత్రము కారణముగ శ్రీ రాముఁ డడవుల కేఁగునప్పుడు సీతయు వలదని యితరులు వారించినను వినక భర్తతోఁగూడ నరణ్యమునకు జని యట భర్తతోఁ గూడఁ గాలముఁగడపుచు, నతనితోడి వాసమే స్వర్గభోగముగ నెంచుచు రససముద్రమున నీదు లాఁడుచుండెను. వివాహ వేదిక పై నొండొరుల సందర్శించు కొనునప్పుడు హఠాత్తుగ మెఱుపువోలె జనించిన సీతారాముల ప్రణయము చిరసహవాసయోగమువలనను, గష్టానుభవము వలనను, బరిశుద్ధ ప్రకృతి జీవనము వలనను, స్థాయీభావము నొందెను. పిమ్మట సీత "రావణుని చే నపహరింపఁబడుట తటస్థించె, ఆయవస్థ రామునకు దుర్బర మయ్యెను. తనసర్వస్వముగ భావించుచుండిన సీత దూరస్టురా లగుటచే నాతనికి బ్రపంచ మంతయు నంధకారమగ్నమైనట్లు తోఁచెను. జీవితపథమున విస్పష్టీకరించు దివ్య ప్రణయజ్యోతిగ భావించుచున్న సీత తనకు దూరమయిపోవుట చే నతనికి దారి తోఁపకుండెను. సీతకొరకయి యాతఁడు విలపించిన విధమంతయుఁ గరుణాస్పదము. సీత నన్యు లెవ్వరో యపహరించిరని భావించి సర్వ ప్రపంచమును నాళముఁ జేయుటకును, సర్వలోకములను డిందుపడఁజేయుట