పుట:2015.370800.Shatakasanputamu.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

54

రస్వామి యీయనకు నిలువేలుపు, ఈమహనీయుఁ డొకప్పుడు శ్రీశైలయాత్రకు వెడలి శ్రీ మల్లికార్జునస్వామిని సేవించి తిరిగివచ్చుచుఁ బల్నాడు తాలూకాలో జెట్టిపాలెముదాపునఁ గృష్ణాతీరమందు విశ్వామిత్రాశ్రమ మనఁబడు సత్రశాల యను పుణ్యస్థలమున శ్రీమల్లి కేశ్వరస్వామిని సేవించుచుఁ గొంతకాలముండి యచ్చటనే యీసర్వేశ్వరశతకమును రచించెను. ఒక్కొక్కపద్య మొక్కొక్కతాటియాకుపై వ్రాసి యాయాకును గృష్ణలో వైచి యది ప్రవాహమున కెదురీఁదివచ్చెనా దానిని దీసి సూత్రమున నెక్కించెద. అ ట్లేయాకైన రాక క్రిందికి గొట్టుకొనిపోయెనా యప్పుడే నాశిరము ఖండించికొనియెద నని శపథము చేసి మెడకు గండకత్తెర వైచుకొని యాకులమీఁదఁ బద్యముల వ్రాసి నీళ్లలో విడిచిపెట్టఁగా నవి తిరిగి వచ్చుచుండినవి. కొంతసేపటికి “తరులం బువ్వులు పిందెలై యొదవి” అను 87-వ పద్య మెదురుగారాక కొట్టికొనిపోవుటఁ జూచి కంఠమును గత్తిరించికొనుట కుద్యమించుచుండఁగా నొక పసులకాఁపరి "నా కొకతాటియాకు దొరకినది చూడుఁ" డని యిచ్చి యదృశ్యుఁడయ్యెను. కవి యాయాకును జూడఁగా దానిపై దానువ్రాసినపద్యమునకు మాఱుగా వేఱొక 88-వ పద్య ముండుటఁ జూచి యిది స