పుట:2015.370800.Shatakasanputamu.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

55

ర్వేశ్వరకృతమని గ్రహించి యాపద్యమును సూత్రమున కెక్కించి తాఁ జేసికొన్న నియమము ప్రకారముననే శతకమునుఁ బూర్తి చేసి కొంతకాలమునకు బిదప నాసత్రశాలయందే సిద్ధిఁబొందె" నని గలదు.

ఇయ్యది శైవభక్తిరసోద్బోధకమయి హృదయంగమముగా నున్నది. ఇం దచ్చటచ్చట ప్రౌఢములగు కల్పనలు గలవు, ఆంధ్రసాహిత్యపరిషత్తువారు ప్రకటించినప్రతియందు లోపము లనేకములున్నందున నిర్దుష్టముగ ఈశతకమును ప్రకటించినారము.

ఇట్లు,

వావిళ్ల. రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్.