పుట:2015.370800.Shatakasanputamu.pdf/624

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

మారుతిశతకము భక్తిరసప్రధానమై ఆంజనేయుని బలపరాక్రమస్థైర్యాదికములను గొనియాడుచున్నది. అప్పకవీయమునం దుదాహరింపఁబడిన మరున్నందనశతకమునకు నీ మారుతిశతకమునకు సంబంధము లేదు. మరున్నందనశతకమునుండి తీసి యుదాహరింపఁబడిన యప్పకవీయములోని పద్య మిది-

శా. "కోపాటోపము కుప్పిగంతులు భవత్కుంఠీభవచ్ఛౌర్యరే
     ఖాపాండిత్యమయారె నీకును నమస్కారంబు లంకాపురీ
     పాపగ్రంథికులాంగనాకుచతటిపైఠాపతద్గ్రాహ్యబా
     హాపాటచ్చరరామదాస తవదాసోహం మరున్నందనా."

ప్రకృతశతకము మారుతిని సంబోధించున దగుటచేతను ఉదాహృతశతకము మరున్నందనుని సంబోధించునదగుట చేతను రెండు నొకటే యను ప్రవాదము విశ్వాసపాత్రముగ లేదు.

ఈమారుతిశతకమును రచించినకవి కొటికలపూడి కోదండరామయ్య. ఇతఁడు జ్యోతిశ్శాస్త్రపారంగతుఁ