పుట:2015.370800.Shatakasanputamu.pdf/606

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

ఈశతకము వ్రాసిన పావులూరిమల్లన రాజరాజనరేంద్రునికాలమున నుండి పావులూరిగణితము వ్రాసిన మల్లనయే యని తొల్లి వ్రాసిన వ్రాతలు ప్రమాదములని తోఁచుచున్నది. గణితశాస్త్రములోని

“పావులూరివిభుఁ డను
                    గార్గ్యగోత్రోద్భవుఁడన్”
“శివ్వనపుత్రుఁడ మల్లనాఖ్యుఁడన్"

అనుపద్యభాగములవలన గణితశాస్త్రము వ్రాసిన మల్లనకవి శివన్నపుత్రుం డనియు గార్గ్యగోత్రుఁ డనియుఁ దెలియుచున్నది. భద్రాద్రిరామశతకము వ్రాసినకవియో ఇందలి 102, 103, 104 పద్యములవలన వాసిష్ఠగోత్రుఁ డనియు రామమంత్రి కుమారుఁ డనియుఁ దెలియుటవలన నిరువు రొకటిగా భావించుట నామసామ్యమువలనఁ గలిగినభ్రాంతియేగాని వేఱుగాదు.

భద్రాద్రిరామశతకమునందలి కవితాధార యంతప్రౌఢముగా లేదు. ఇందలి పద్యములన్నియు మకారప్రాసతో రచింపఁబడుట యొకవిశేషము. ఇటుల రచించుటకుఁ గారణము మకుటమంతయు నొకపాదము నాక్రమించుటయే యై యున్నది. ఇందలిపద్య