పుట:2015.370800.Shatakasanputamu.pdf/607

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ములలో మనోహరములగు కల్పనములుగానీ రమణీయములగు భావములుగానీ లేవు. పురాణములకు సరిపోలు శ్రీరామునివిశేషణముల కూరుపుమాత్రము ప్రతిపద్యమున నిముడ్పఁబడియున్నది. శ్రీరామనామచింతనాపరుల కీశతకము రామస్మరణము గావించుపట్టున మిగుల నుపయోగకరముగా నుండును.

ఈకవి పావులూరి నివాసినని చెప్పికొనినాఁడు. పావులూరులు పెక్కులుంటవలనం గవినివాసమగు [1]పావులూ రేదియో తెలిసికొనఁదగిన యాధారములు కానరావు. ఇందలిపద్యములయందు రామనామము పెక్కుమాఱు లిముడ్పఁబడియుంటవలన నీశతకకర్త రామనామామృతపానప్రమత్తుఁడుగ నుండి భక్తుల కీశతకరూపమున రామనామామృతమును బ్రసాదించెనేమో యని తోచెడిని.

కవి యీశతకమును మిగుల బాల్యావస్థలో వ్రాసినటులఁ బదప్రయోగలాఘవమునుబట్టి ధారాలోపమునుబట్టి యూహింపవచ్చును. శతకము సులభము సుబోధమునై యున్నది.

నందిగామ.

ఇట్లు భాషాసేవకులు,

1-1-25.

శేషాద్రిరమణకవులు, శతావధానులు.

  1. వంగవోలు తాలుకా పావులూరు కవినివాసమని కొంద ఱందురు.