పుట:2015.370800.Shatakasanputamu.pdf/574

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

ఈ రామప్రభుశతకము వ్రాసినకవి కాశ్యపగోత్రుఁడనియు కామేశ్వరాఖ్యుఁడనియు నిందలి మూఁడవపద్యమువలనఁ దెలియుచున్నది. ఇందలిపద్యములు మనోహరమగు శైలిలో ధారాశుద్ధిగలిగి కేవల భక్తిరసోద్దీపకములుగా నలరారుచున్నవి. ఇతరపద్యానుకరణము లీశతకమునఁ గొలఁదిగా గలవు. కవి తాను వయో౽తిరేకంబునిఁ గామాంధతచే వర్తించితిననియు జీవితమంతయు రాజసేవచే గడిపితిననియు బాల్యమున నార్జించిన విద్యావివేకాదికములను బరమార్థచింతనమున కుపయోగింపనైతినని పశ్చాత్తాపము నొందుచుఁ బలవించుచుఁ బద్యములు వ్రాసినటుల నాయాతావులఁ గలపద్యములు బోధించుచున్నవి.

శ్రీమన్నారాయణుని లీలావిశేషంబుల మానవులు పెక్కువిధంబుల వర్ణించుట సహజంబు. అందు నెక్కువఁగ శతకరూపమున లోకంబున భక్తివర్ణనం బగపడుచున్నది.ఎంద ఱెన్నివిధంబులఁ గొల్చినను బరమేశ్వరుండు సర్వాంతర్యామియేగాన సముండయి యందఱఁ బ్రోచుచుండు.

ధారాశుద్ధియుఁ బరితాపవిధము జూడ నీగ్రంథము కవికిఁ దుదిపొత్తమనియే తోఁచును. పలుతావుల వ్యాకరణదోషములు గానవచ్చుచున్నవి. కేవల భక్తిపారవశ్యమునఁ బశ్చాత్తాప మొందుతఱిగూడ