పుట:2015.370800.Shatakasanputamu.pdf/542

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

591

కిచ్చు ప్రజలకుఁ బైపఙ్క్తు లన్వయించును. విద్వాంసులు, శాస్త్రజ్ఞులు, సత్కవులు సంతత వాజ్మయపరిశ్రమము చేయుచుందురు. వారు రాజులయొక్కయు బ్రజలయొక్కయు నాదరణమును బొందుట యవసరంబైననగును. ప్రజలు భరింపకపోవుదురుగాక! రాజు లాదరింపకపోవుదురు గాక! ఉదరపూరణార్థము స్వేదకణంబు లొలుక శరీరమును గష్టపెట్టవలసియున్నను, నపారదారిద్ర్యంబునఁ గడగండ్ల నందుచున్నను నాత్మగౌరవంబు, స్వాతంత్ర్యంబు వదలక యుత్తమమార్గమునఁ బ్రవర్తించిన బమ్మెరపోతరాజు నెయ్యది కడుపు చల్లగాఁ గనెనో యాయాంధ్రదేశమునకు జయము. పార్వతీశముగారో వారితండ్రి నరసింహముగారో కొందఱఁ బొగడుదుఁ గొందఱఁ దెగడుచు వ్రాసిన పద్యములు కొన్ని తాళపత్రములమీదఁ గాన్పించినని. ఆపద్యముల నుదాహరించుచున్నాను.

క.

ఉత్తముల కీయ నేర్చిన
యుత్తములను నడుగనేల యుత్తలపడమా
కిత్తఱిని వేడనేటికిఁ
జిత్తము మీ రెఱుఁగరయ్య చింతితఫలదా.

1


క.

విత్త................
విత్తాఢ్యుం డైన క్రొత్త వేంకటనరసా
యుత్తమలోకము కేగెను
జిత్తము రంజిల్ల మోక్షచింతారతుఁడై.

2