పుట:2015.370800.Shatakasanputamu.pdf/541

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

590

యాచనకుఁ బచ్యరచనయే యప్పటికి నిప్పటికిఁ బరమసాధనముగా నున్నది. కాకునూరి అప్పయ్యలాక్షణికుల వారికతమున మా పల్నాటిసీమయే పద్యరచనామార్గమును విశాలపఱచెను. తిట్టుపద్దెము లల్లి వ్యాపింపఁ జేయుదురనుభయము కవిబిరుదధారులయెడఁ బూర్వకాలమునుండి వచ్చుచున్నది. ఈభయమువలన నేమి, పద్యరూపస్తోత్రాపేక్ష నేమి, యాచించినప్పుడు వైదికావధానులకు, (వేదమును వల్లించు నవధానులు) శాస్త్రులకు, సోమయాజులకుఁ, బాకయాజులకు నిచ్చినదానికంటె జను లిప్పటికిఁ గవీశ్వరబిరుదధారులకే యెక్కువగా నిచ్చుచున్నారు. కవీశ్వరబిరుదమును ధరించిన యాచకులు వేలకువేలు గడించితి మని విఱ్ఱవీగుటయు సంభవించుచున్నది. ఈయాచకులవలనఁ గవిశబ్దమునకు గౌరవము పోయినదని చెప్పవచ్చును. ఈయాచకులు ఘనమైన కవిశబ్దమును బాడుసేయుచుండఁగా దానిని గమనింపక వారికి నూఱాఱు లిచ్చు నిప్పటిప్రజల యజ్ఞానమునుగూర్చి మిక్కిలి చింతింపవలసియున్నది. కవీశ్వరబిరుదమును ధరించి చేసినయాచనయే మహాగౌరవకర మని తలంచి యాత్మస్తుతులు గావించికొనుచు, మాకంటే ఘనులు లేరని చెప్పుకొనుచు గర్వపర్వతశృంగము నధిష్టించి యుండునజ్ఞులకు నట్టివారి