పుట:2015.370800.Shatakasanputamu.pdf/434

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

ఆంధ్రనాయకశతకమును కాసుల పురుషోత్తమకవి రచించెను. ఇతఁడు బందరు సమీపమునందున్న శ్రీకాకుళమునందలి ఆంధ్రవిష్ణునిగూర్చి యీశతకమును రచించెను. పురుషోత్తమకవి భట్టురాజు కులమువాఁడనుటకు శతకములోని "రట్టు సేయుదుఁ గనుము నాబట్టుతనము” అనుపద్యభాగము సహాయము చేయుచున్నది. ఈకవినివాసము శ్రీకాకుళము చెంతఁ గల పెదప్రోలు. ఇతఁడు కాశ్యపగోత్రుఁడు. అప్పలరాజు రమణాంబల కుమారుఁడు. అర్ధంకి తిరుమలాచార్యులశిష్యుఁడు. ఈయంశ మీకవి రచించిన హంసలదీవి గోపాలశతకములోని యీక్రిందిపద్యమువలనఁ దెలియును.

సీ. కాశ్యపగోత్రుఁడఁ గాసులవంశచం
                    ద్రముఁడ నప్పలరాజు రమణమాంబ
     కూర్మితనూజుండ గురువులౌ నద్దంకి
                    తిరుమలాచార్య శ్రీచరణపద్మ
     భవ్యతీర్థమరందపానద్విరేఫాయ
                    మానమానసుఁడను మాన్యహితుఁడ
     పురుషోత్తమాఖ్యుఁడ పూదండవలె నీకు
                    శతకంబుఁ గూర్చితి శాశ్వతముగ